Sunday, April 28, 2024
- Advertisement -

జగన్ కు మోడీ అపాయింట్‍మెంట్ ఎందుకు ఇచ్చారు ?

- Advertisement -

వైసీపీ ఎన్డీఏ లోకి చేరుతుంది అన్న వార్తలపై ఢిల్లీలో హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రధాని మోడీ తో జగన్ భేటీ అయ్యారని జోరుగా ప్రచారం సాగుతోంది. కరోనా మొదలైనప్పటి నుంచి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వని మోడీ తాజాగా జగన్ కు ఇవ్వడం పై ఆసక్తి నెలకొంది. దాదాపు 40 నిమిషాల పాటు వీరి భేటి కొనసాగడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అయితే జగన్ ఎన్డీయేలోకి చేరబోతున్నారని విషయాన్ని ఆ వైసీపీ నేతలు కూడా ఖండించడం లేదు.

ఇటు నిక్కచ్చిగా చెప్పడమూ లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. ప్రధానమంత్రితో సీఎం సమావేశం ఫలప్రదానంగా జరిగింది. రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకారం అందించడానికి పీఎం సానుకూలత వ్యక్తం చేశారు అంటూ అందులో పేర్కొన్నారు. ఈ ట్వీట్ లో విజయసాయి రెడ్డి అటు ఎన్డీయేలో చేరడం పై కానీ ఇటు రాజకీయ చర్చలపై కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఒకవేళ ఎన్డీయేలో చేరికపై ప్రధాని ఇప్పుడే తొందర వద్దని ఆగమన్నారా.. లేక మరే ఇతర చర్చలు ఏమైన జరిగాయా అనేది రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ. ఎలాగూ ఎన్డీఏలో చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మిత్రపక్షంగా కొనసాగుతుంది.

కేంద్రం తీసుకువస్తున్న ప్రతి బిల్లుకు మద్దతు తెలుపుతూనే వుంది. అయితే ఎన్డీయేలోకి చేరితే జగన్ రూటు కొంతవరకు మారినట్టుగా అవుతుంది. అందుకే ఈ విషయంలో పార్టీకి తర్జనభర్జనలు ఉండనే ఉంటాయి. అన్నింటికీ మించి రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై మోడీ సానుకూలంగా స్పందిస్తే వైసీపీకి అంతకన్నా పెద్ద విజయం ఉండదు. ప్రధాని మోడీ తో భేటీలో ఈ అంశంపై ఎంతవరకు హామీ లభించింది అసలు వైసీపీ ఎన్డీయేలో చేరుతుందా.. భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలియకుండా ఉంది. ఈ భేటీపై ఎవరో ఒకరు స్పందించి కచ్చితమైన సమాచారం ఇస్తే కానీ క్లారిటీ వచ్చే పరిస్థితులు లేవు.

కేంద్ర క్యాబినేట్ లోకి వైసీపీ..?

మరోసారి వారికి చంద్రబాబు తన స్టైల్ లో వెన్నుపోటు..?

దుబ్బాక లో కాంగ్రెస్ కు విమర్శనాస్త్రం దొరికినట్లేనా..?

ఎవరు మౌనంగా ఉన్నా ఈ టీడీపీ లీడర్లు మౌనంగా ఉండడం ఏంటి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -