Friday, April 19, 2024
- Advertisement -

మరోసారి వారికి చంద్రబాబు తన స్టైల్ లో వెన్నుపోటు..?

- Advertisement -

నమ్ముకున్న వారిని దగా చేయడం చంద్రబాబు కు వెన్నతో పెట్టిన విద్య. సొంత వారిని సైతం చంద్రబాబు వెన్నుపోటు పాడవకుండా లేరు అన్నది అందరికి తెలిసిన విషయం.. అయితే తన పార్టీ నేతలకు కూడా చంద్రబాబు అప్పుడప్పుడు హ్యాండ్ ఇస్తూఉంటారు.. అయితే ఆ విషయం పెద్దగా బయటకు పొక్కేది కాదు.. దాంతో ఆ నేతలు తమ బాధను ఎవరికీ చెప్పాలో తెలియక లాగే ఉండిపోతారు.. అయితే ఇలా చంద్రబాబు మోసం చేసిన వారిలో గతంలో రాజకీయాలను శాసించిన వారున్నారు.. అత్యంత అంకిత భావంతో పార్టీ అభ్యున్నతికి  పనిచేసిన వారున్నారు.. అలాంటి వారిని సైతం చంద్రబాబు తన రాజకీయానికి ఉపయోగించి వదిలేశారు..

అలా చంద్రబాబు మోసానికి గురైన వారిలో టీడీపీలో కొన్ని ద‌శాబ్దాలుగా చ‌క్రం తిప్పుతున్న నాయ‌కులు ఉన్న  దామ‌చ‌ర్ల కుటుంబం ఒక‌టి. 2012 ఉప ఎన్నిక‌ల నుంచే జ‌నార్థన్ ప్రకాశం జిల్లా రాజ‌కీయాల‌ను శాసిస్తూ వ‌చ్చారు. దామ‌చ‌ర్ల జ‌నార్దన్‌, ఆయ‌న సోద‌రుడు స‌త్య టీడీపీ కృషి కోసం ఎంతో పాటుపడ్డారు..  2014 ఎన్నిక‌ల్లో జ‌నార్థన్ ఒంగోలులో బాలినేనిని ఓడించ‌డంతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండ‌డంతో ఆయ‌న హ‌వా ప్రారంభ‌మైంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో మంత్రిగా సిద్ధా రాఘ‌వ‌రావు ఉన్నా జ‌నార్థనే చ‌క్రం తిప్పారు. ఆయన తమ్ముడు కూడా పార్టీ లో తలెత్తిన సమస్యలను యిట్టె పరిష్కరించేవారు..

అయితే, గ‌త ఎన్నిక‌ల్లో దామ‌చ‌ర్ల ఓట‌మితోపాటు.. ప్రకాశం జిల్లాలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాలు టీడీపీ నుంచి జారిపోయాయి. దాంతో అప్పటినుంచి చంద్రబాబు ఈ కుటుంబాన్ని పక్కన పెట్టడం మొదలుపెట్టారు. ఇటీవలే ప్రకటించిన పార్లమెంట్ ఇన్ ఛార్జ్ ల విషయంలో చంద్రబాబు కనీసం వీరిని పట్టించుకోలేదు. ప‌రిశీల‌కులు చెబుతున్న దాని ప్రకారం.. స‌త్య ప‌రోక్షంగా వైసీపీ నేత‌ల‌తో క‌లిసి ప‌నిచేస్తున్నార‌ని, దీనిని అడ్డుకోవ‌డంలో జ‌నార్దన్ దృష్టిపెట్టలేద‌ని అది గమనించిన చంద్రబాబు వీరిని దూరం పెట్టారని చెప్తున్నారు.  బాప‌ట్ల పార్లమెంట‌రీ జిల్లా ప‌గ్గాలు క‌మ్మ వ‌ర్గానికి చెందిన ప‌రుచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబ‌శివ‌రావుకు ఇవ్వడంతో ఒంగోలును బీసీకి ఇవ్వడంతో జ‌నార్థన్‌కు షాక్ త‌ప్పలేదు. ఇక జనార్థన్ సోద‌రుడు స‌త్యకు కందుకూరు లేదా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జ్ ప‌గ్గాలు ఇస్తార‌నుకున్నా బాబు ఇవ్వలేదు. దాంతో ఉద్దేశ్యపూర్వకంగానే బాబు వీరిని దూరం పెట్టారని అర్థమైపోతుంది..

చంద్రబాబు ఈ పిచ్చి నమ్మకానికి కారణం ఇదేనా..?

చంద్రబాబు డ్రామాలకు హద్దులు లేవా.?

చంద్రబాబు అవినీతి కి ఎందుకు కొమ్ము కాస్తున్నాడు.?

జగన్ ఇలా ప్లాన్ చేస్తే టీడీపీ ఏపీ లో ఉండను గాక ఉండదు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -