Saturday, April 27, 2024
- Advertisement -

గంటా శ్రీనివాసరావు గురించి జగన్ మనసులో మాట..?

- Advertisement -

రాష్ట్రంలో గంటా శ్రీనివాసరావు గురించి రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. దాంతో ఏపీ రాజకీయం ఆయన చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ మారుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. రాజకీయ విశ్లేషకులు ఫోకస్ అంత ఆయనపై పెట్టారు. కానీ ఈ అంశాన్ని గంట ఎప్పటికప్పుడు పొడిగించడంతో.. అందరూ ఏదో విషయం తేల్చాలని పట్టు పట్టారు. ఆ కోవాలోనే ఆయన వైసీపీ లోకి వెళ్లాలని ఆసక్తి చూపగా.. ఆ పార్టీ వారు గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకించారు.

ముఖ్యంగా విశాఖ నేతలైన అవంతి శ్రీనివాస్, విజయసాయిరెడ్డి లాంటివారు గంటా వస్తే ఆ ప్రాంతపు రాజకీయాలపై తమకు పట్టుపోతుందని చెప్పో గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. జగన్ ఓ సమయంలో గంట ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్న వీరి బలవంతంతో ఆయన తన మనసు మార్చుకున్నారని అంటున్నారు. ఇక బీజేపీ లోకి వెళ్దామని గంట ఆలోచించిన అక్కడ సోము వీర్రాజు ఇప్పటికే వెళ్లిన టీడీపీ లీడర్లు పాత్రను నామమాత్రం చేశారు. వారికి పార్టీలో ఎలాంటి అధికారం లేకుండా చేస్తూ ప్రేక్షక పాత్ర వహించే విధంగా చేశారు. దాంతో అక్కడికి వెళ్ళడం ఇష్టం లేక గంట టీడీపీలోనే ఉండిపోయారు.

ఇక గంట ఎక్కడికి వెళ్లారు అనుకుంటున్న సమయంలో గంట తనయుడు రవితేజ వైఎస్సార్సీపీలో చేరతారని గంట కూడా వాసుపల్లి గణేష్ బాటలో జగన్ కి జై కొడతారు మీడియా ఊదరగొట్టింది. కానీ ఈసారి ముహూర్తం కూడా మురిసిపోయింది. కానీ ఎటువంటి మార్పులు లేవు. దానికి అనేక కారణాలు ఉన్నట్టుగా చెబుతాన్నారు. ముఖ్యంగా అధికార పక్షం లో చేరాలని గంట తీవ్రంగా తహతహలాడుతున్న అంతా భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఆటో అసెంబ్లీలోనూ ఇటు బయట కూడా జగన్ మీద విమర్శలకు ఆయన పూనుకోవడం లేదు. అంతే కాకుండా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. తద్వారా తాను వైఎస్సార్ సీపీకి చేరువై ఉద్దేశంలో ఉన్నారనే సంకేతాలు పంపిస్తున్నారు. అయితే జగన్ గంట గురించి ఆలోచించటానికి ఒక కారణం ఉంది. గంట పార్టీ మారితే టీడీపీకి తీవ్ర నష్టం జరుగుతుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని జగన్ గంట గురించి మరొకసారి ఆలోచిస్తున్నారట.

తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబు వెనకడుగుకు కారణం ఏంటి..?

కోదండ రాం ఒంటరిగా వేల్లాల్సిందేనా..?

జగన్ పై గోరంట్ల అసంతృప్తికి కారణం అతనేనా..?

చంద్రబాబు మించిన జగన్ రాజకీయ ఎత్తుగడ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -