Thursday, May 2, 2024
- Advertisement -

బాబుకు హెడేక్ వ్యవహారం… తప్పుతుందా..?

- Advertisement -

టిడిపి పార్టీ ఇకపై నుంచి కొత్తగా బయట శత్రువులను ఎదుర్కోవడం కోసం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఏం చేసినా లోపల ఫైట్లు చేయాల్సిందేనేమో. రేవంత్ ఎపిసోడ్ చూస్తుంటే అంతర్గత పోరును ఫేస్ చేయక తప్పేలా లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే వారు. ఇప్పుడేమో టీడీపీలో ఈ డైలాగ్ వినిపిస్తుంది.

రేవంత్ ఒక్కడితోనే ఇంటిపోరు ఆగేలా లేదు. మరికొందరు టిటీడిపి శ్రేణులు కూడా… రేవంత్ తర్వాత తమ గళం వినిపించేలా ఉన్నారు. అయితే వారంతా సమయం కోసం వేచి చూస్తున్నారు. ఆ సమయాన్ని రేవంత్ రూపంలో తగిలిన సెగ రాజేసేలా ఉంది. చంద్రబాబు ఎంతో తెలివిగా ఈ హెడేక్ వ్యవహారంలో తాను తప్పుకుని తన అనుచరులకు ఇష్యూని డైవర్ట్ చేశాడు. కాని వారి వల్ల అది వర్కవుట్ కావడం లేదు.

రేపన్న రోజు బాబు ఇండియాకు వచ్చాక రేవంత్ ఇచ్చే వివరణకు వినాల్సి వస్తుంది. ఆటైమ్లో బాబు అప్పటికప్పుడు సమాధానం చెప్పలేడు.అందుకే ఆయనొచ్చే లోపే విషయం తేలిపోయేలా ప్లాన్లు వేస్తున్నారు. లోకేష్ బాబు నేతృత్వంలో ఈ తతంగమంతా జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాకపోతే యనమల,పయ్యావుల,ఉమ లాంటి హేమాహేమీలు ఇంటిపోరును పెద్దది చేయకుండా పార్టీకి డ్యామేజ్ జరగకుండా చూడాలని చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -