గ్రేటర్ వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటనలో నిరసనల సెగ తగిలింది. ఉద్రిక్తతల నడుమ తెలంగాణ మంత్రి కేటీఆర్ గ్రేటర్ వరంగల్ పర్యటన కొనసాగుతోంది. మంత్రి తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వెళ్తున్న క్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సునీల్ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలని, నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేస్తూ కాన్వాయ్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేసినా.. పలువురు కాన్వాయ్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
నిరసనల మధ్యే కేటీఆర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. త్వరలో గ్రేటర్ వరంగల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మిషన్ భగీరథలో భాగంగా వరంగల్ నగర వాసులకు తాగు నీరు అందించే కార్యక్రమాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రారంభించారు.
అదితీరావు ‘మహాసముద్రం’ ఫస్టులుక్!
మాస్కులు ధరించని వారిపై పోలీసులు కొరడా !
‘ఖిలాడీ’ టీజర్ రిలీజ్.. మాస్ రాజా మళ్లీ హిట్ కొట్టేలా ఉన్నాడే..!