ప్రస్తుతం దేశంలో చాలా చోట్ల కాషాయ జెండా రెపరెపలాడుతోంది. మోడీ మేనియాతో కమలదళంకు ఎదురే లేదు అన్నట్లుగా ముందుకు దూసుకుపోతోంది. అయితే ఉత్తరాదిన బీజేపీ హవా గట్టిగానే ఉన్నప్పటికి, దక్షిణాదిన మాత్రం బీజేపీ చతికిల పడుతోంది. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలలో బీజేపీ పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలపై పట్టుకోసం గట్టిగానే ఫోకస్ చేసినట్లు ఉంది కమలదళం. ఇక వచ్చే నెల 2,3 తేదీలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో జరగనున్నాయి. హైదరబాద్ లో జరగబోయే ఈ సమావేశాలకు ప్రధాని మోడీ హాజరు కాబోతున్నట్లు సమాచారం.
ఈ సమావేశాలతో తెలంగాణ బీజేపీ క్యాడర్ లో కొత్త ఉత్సాహం నింపడంతో పాటు రాష్ట్రంలో బీజేపీ అనుకూల వాతావరణం తీసుకురావాలని కమలనాథులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమావేశాలకు భారీ స్థాయిలో ప్రజలు వచ్చేలా చూడాలని పార్టీ పెద్దలు రాష్ట్రంలోని బీజేపీ నేతలకు సూచిస్తున్నారట. దాదాపుగా పది లక్షల మంది ఈ సభలకు హాజరు అయ్యేట్లుగా బీజేపీ నేతలు టార్గెట్ పెట్టుకున్నారట. మరి అంత మంది ప్రజలను సమకూర్చడం ప్రస్తుతం కమలనాథులకు తలనొప్పిగా మారింది. అయితే ఇప్పుడు వర్షాకాలం కావడంతో ప్రజలు అంత భారీ సంఖ్యలో హాజరు అవుతారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ప్రధాని మోడీ సభ కావడంతో జనసమీకరణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కమలనాథులు చెప్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ సభకు ఇన్ చార్జ్ గా వ్యవహరించనున్నారు. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్, పార్టీ నేత ప్రదీప్ కుమార్ వంటి వారు సభను సవ్యంగా నిర్వహించేందుకు అన్నీ చర్యలు చేపడుతున్నారు. కేవలం గ్రేటర్ హైదరబాద్ తోపాటు చుట్టూ పక్కల ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది సభలకు వచ్చేలా అన్నీ చర్యలు తీసుకోవాలని నేతలు భావిస్తున్నారట. మొత్తానికి ప్రధాని మోడీ రాకతో తెలంగాణ కమలనాథులలో కొత్త జోష్ కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
పవన్ కు తలనొప్పి.. జనసైనికుల ప్రెజర్ ?
లోకేష్ vs ఎన్టీఆర్ .. ఎవరికి పగ్గాలు ?
కేంద్రం మెడలు వంచే సూపర్ ప్లాన్ ..