Tuesday, March 19, 2024
- Advertisement -

టీడీపీ కనుమరుగవ్వడం ఖాయమేనా ?

- Advertisement -

ఏపీలో తెలుగుదేశం పార్టీ కనుమరుగవ్వనుందా ? రాబోయే ఎన్నికలే దీనికి సంకేతాలుగా మారనున్నాయా ? అంటే అవుననే వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి చాలా దారుణంగానే ఉంది. ఎందుకంటే పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటలు ఈ మద్య కాలంలో బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా చంద్రబాబు తరువాత పార్టీ నాయకత్వం ప్రశ్నార్థకంగానే ఉంది. ప్రస్తుతం చంద్రబాబు వయసు 72 సంవత్సరాలు.. నెక్స్ట్ ఎన్నికల తరువాత చంద్రబాబు రాజకీయాలకు విరామం ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వంపై గత కొంత కాలంగా టీడీపీ వర్గంలోను, ప్రజల్లోనూ విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా చంద్రబాబు తరువాత ఆయన తనయుడు నారా లోకేష్ పార్టీని నడిపిస్తాడనే వాదనలు వస్తున్నప్పటికి.. ఒకవేళ చంద్రబాబు తరువాత పార్టీ అద్యక్ష బాద్యతలు లోకేష్ కు అప్పగిస్తే.. లోకేష్ సమర్థవంతంగా నడిపించగలడా ? అనే దానిపై తెలుగు తమ్ముళ్లే పెదవి విరుస్తున్నారు. లోకేష్ రాజకీయాల్లో క్రియాశీలకంగా తన వాక్ చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలం అవుతున్నదనేది జగమెరిగిన సత్యం… అటు ప్రత్యర్థి పార్టీ నేతల విమర్శలను ఘాటుగా తిప్పికొట్టడంలో కూడా లోకేష్ తడబడుతున్నాడు. ముఖ్యంగా ఒక పార్టీ అద్యక్షుడిగా ఉన్నప్పుడూ తన వాక్ చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకోవడంతో పాటు, ఎదురవుతున్న విమర్శలను అంతే స్థాయిలో తిప్పికొట్టాలి. అప్పుడు సొంత పార్టీలోని నేతల్లో జోష్ పెరిగి రెట్టింపు ఉత్సాహంతో పని చేయగలరు. ఆ విషయంలో జగన్, కే‌టి‌ఆర్, పవన్ కల్యాణ్ వంటి వారు.. వారియొక్క వాక్ చాతుర్యంతో ప్రజలను ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో అందరికీ తెలిసిందే. మరి లోకేష్ ఆ స్థాయిలో ఆకట్టుకోగలడా ? అంటే సమాధానం దొరకడం కష్టమౌతుంది.

ఒకవేళ లోకేష్ కాకుండా నందమూరి బాలకృష్ణ కు పార్టీ బాద్యతలు అప్పగిస్తే ఆయన వైఖరి కూడా దాదాపుగా లోకేష్ మాదిరిగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని, తెలుగు తమ్ముళ్ళు బహిరంగంగానే వారియొక్క వాదనను బలంగానే వినిపిస్తునారు. ఎందుకంటే చంద్రబాబు తరువాత టీడీపీ ని జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే సమర్థవంతంగా నడిపించగలడని, రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించగలడని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు. ముఖ్యంగా రాబోయే 2024 ఎన్నికల నుంచే ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాలనే డిమాండ్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీకి ఎదురైన ఘోర పరాజయం.. ఆ పార్టీ చరిత్రలోనే ఎన్నడూ జరగలేదు. మళ్ళీ అలాంటి పరిణామాలు పునరావృత్తం కాకూడదు అంటే టీడీపీ బ్యాక్ బోన్ గా ఎన్టీఆర్ ను చూపక తప్పదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎన్టీఆర్ కాకుండా లోకేష్ పార్టీ నాయకత్వం వహిస్తే రాబోయే ఎన్నికల తరువాత టీడీపీ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందనే వ్యాఖ్యలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి..

ఇవి కూడా చదవండి

బీజేపీ ఫోన్ కాల్స్ ఫలిస్తాయా ?

పెను సంక్షోభానికి దగర్లో ..ఏపీ !

టి‌ఆర్‌ఎస్ అద్యక్షుడిపై .. కే‌సి‌ఆర్ దృష్టి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -