Friday, April 26, 2024
- Advertisement -

కేంద్రం మెడలు వంచే సూపర్ ప్లాన్ ..

- Advertisement -

ప్రస్తుతం రాష్ట్రపతిగా కొనసాగుతున్న రామ్ నాథ్ కొవింద్ పదవి కాలం జులై 24 తో ముగుస్తుండడంతో రాష్ట్రపతి ఎన్నికల హీట్ పెరుగుతోంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎలక్షన్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. జులై లో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రేస్ అభ్యర్థులను నిలబెట్టేందుకు దేశంలోని ప్రధాన పార్టీలు ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తమ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే ఇతర పార్టీల నుంచి మద్దతు కొరవలసి ఉంటుంది.

ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం ఇతర పార్టీల మద్దతు కోరుతుందా ? లేక ఏకగ్రీవ ఎన్నిక జరుగుతుందా ? ఒకవేళ ఇతర పార్టీల మద్దతు కోరితే .. ఏయే పార్టీల మద్దతు లభిస్తుంది ? అనేది ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి నేపథ్యంలో కేంద్రం మెడలు వంచే అదిరిపోయే ఛాన్స్ ఏపీ ప్రభుత్వానికి వచ్చిందనే చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థిని గెలిపించుకోవాలంటే అందుకు వైసీపీ సాయం చాలా అవసరమౌతుంది. వైసీపీ కి 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికకు ఇవి కీలకంగా మారే అవకాశం ఉంది.

అందువల్ల వచ్చిన ఈ గోల్డెన్ ఛాన్స్ ను ఏపీ సి‌ఎం జగన్ కరెక్ట్ గా ఉపయోగించుకుంటే రాష్ట్రనికి రావలసిన నిధులతో పాటు, ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుకునే విధంగా పయత్నించవచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా ప్రస్తావించారు. మరి ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ వచ్చినప్పుడు సి‌ఎం జగన్ కేసులకు బయపడి కేంద్రాన్ని నిలదీయకపోతే ఏపీకి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది. మరి వచ్చిన ఈ అవకాశాన్ని సి‌ఎం జగన్ ఉపయోగించుకుంటారా ? లేదా అనేది చూడాలి.

Also Read

1.ఏపీలో కాషాయ జెండా ఎగురుతుందా ..?

2.చంద్రబాబు ఈ లాజిక్ మిస్ అవుతున్నారా ?

3.ఆపరేషన్ గుజరాత్ .. మోడీకి చెక్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -