పవన్ కు తలనొప్పిగా మారిన.. ఆ సమస్య ?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ అభిమానఘనం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సొసైటీ పట్ల కాస్త ప్రశ్నించే గుణం ఉన్న పవన్..ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అభిమానుల అండతో కింగ్ మేకర్ గా ఉండాలని భావించిన విషయం విధితమే. 2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ స్థాపించి ఉవ్వెత్తున ఏపీ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేశాడు. అయితే మొదట్లో తాటాకుచప్పులు చేసిన పవన్ వైకరి ని ఏపీ ప్రజలు త్వరగానే పసిగట్టారు. ముఖ్యంగా పవన్ తీసుకునే అస్థిర నిర్ణయాలు, పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉండలేకపోవడం వంటికి ప్రజల్లో తీవ్ర ప్రభావం చూపాయి. ..

పవన్ టైమ్ పాస్ పాలిటిక్స్ చేస్తాడని, నిజంగా ప్రజలకు సేవ చేసే ఆలోచన పవన్ కు లేదనే విమర్శలు పెరిగిపోవడమే కాకుండా పవన్ వైఖరి కూడా ఆ విమర్శలకు బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక వంటి రెండు చోట్ల పోటీ చేసి దారుణంగా ఓటమి పాలైయాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు పవన్ను ప్రజలు నమ్మడం లేదనే విషయం. ఒక పార్టీ అద్యక్షుడు పోటీ చేసిన రెండు చోట్ల కూడా దారుణంగా ఓటమిపాలు కావడం.. ఏపీ రాజకీయ చరిత్రలోనే బహుశా ఒక్క పవన్ విషయంలోనే జరిగిందనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన షాక్ నుండి పవన్ ఇప్పటికీ కూడా బయటపడలేకపోతున్నాడు. దాంతో ఇదే సీన్ రిపీట్ అవ్వకుండా రాబోయే ఎన్నికల కోసం పవన్ ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నాడు. 2024 ఎన్నికల్లో సి‌ఎం పదవే టార్గెట్ గా పవన్ వ్యూహాలకు పదును పెడుతున్నాడు.

- Advertisement -

అయితే ఇప్పుడు పవన్ ముందు ఉన్న అతిపెద్ద సమస్య తాను పోటీ చేసే స్థానంపై క్లారిటీ లేకపోవడం, గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు చోట్ల పోటీచేసి దారుణంగా ఓటమి చవిచూసిన పవన్ ఈ ఎన్నికల్లో తాను పోటీ చేసే స్థానం విషయంలో కాస్త సందిగ్ధంలో పడ్డాడట. ఈసారి తాను పోటీ చేసే స్థానంలో తనకున్న బలంతో పాటు ఇతర పార్టీల బలాన్ని కూడా బేరీజు వేసుకొని పోటీ చేయాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జనసైనికులు మాత్రం తిరుపతి, కాకినాడ, భీమిలి, వంటి నియోజిక వర్గాలతో పాటు మళ్ళీ భీమవరం, గాజువాక నియోజిక వర్గాల పేర్లు కూడా సూచిస్తున్నారట. మరి పవన్ మనసులో ఏం ఆలోచన ఉందో తెలియదు గాని, ఈసారి తాను పోటీ చేసే స్థానంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

అప్పుల ఊబిలో బీజేపీ పాలిత రాష్ట్రాలు !

ఎన్టీఆర్ జపం చేస్తోన్న..చంద్రబాబు ?

నేతల బూతు పురాణం..జగన్ కు తలనొప్పి !

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -