Monday, May 13, 2024
- Advertisement -

జ‌న‌సేన పార్టీకి ఫండింగ్‌ ఆ నిర్మాతే నంట‌..?

- Advertisement -

కొత్త‌గా పార్టీనీ ఏర్పాటు చేయ‌డం కంటే దాన్ని న‌డ‌ప‌డ‌మే చాలా క‌ష్టం. పార్టీనీ న‌డ‌పాలంటే చిన్న విష‌యం కాదు. దానికి భారీగా ఫండింగ్ అవ‌స‌రం. ఏ పార్టీకైనా ఫండింగ్ అనేది స‌ర్వ‌సాధార‌నం. సినిమా జనాలు, కాస్త క్రేజ్ వున్న వాళ్లు పార్టీ పెడితే ఫండింగ్ చేసే వాళ్లు ఎప్పుడూ వుంటారు.

ప‌వ‌న్ క‌ళ్యాన్ స్థాపించిన జ‌న‌సేన పార్టీకి తెర‌వెనుక ఫండింగ్ అంతా జనసేనకు ఆవిర్భావ సమయంలో నిర్మాత పివిపి ఫండింగ్ చేసారన్నది బహిరంగ రహస్యం. పార్టీ టికెట్లు ఇత‌ర వ్య‌వ‌హారాలు ఎన్ని ఉన్నా …తెర‌వెనుక ఫండింగ్ కామ‌న్‌. ఆయన అప్పట్లో విజయవాడ ఎంపీ సీట్ ఆశించారు. కానీ పవన్ ఎంత ట్రయ్ చేసినా, చంద్రబాబు సహకరించక అది సాధ్యం కాలేదు.

గ‌తంలో జ‌న‌సేన క్రియాశీల‌కంగా లేక‌పోయినా ఇప్పుడు మాత్రం పార్టీ కార్య‌క్ర‌మాలు ఊపందుకుంది. ఇప్పుడు పలువురు తలో చేయి వేయాల్సిన అవసరం వుంది. అలా చేయి వేస్తున్న వారిలో ఓ అప్ కమింగ్ నిర్మాత వున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నిర్మాత ఇప్పటికే ఓ చిన్న సినిమా తీసి దెబ్బతిన్నారు. ఎన్నారై అయిన ఈ నిర్మాత ఇప్పుడు మరో సినిమా తీస్తున్నారు.

మ‌రి కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వ‌నుంది. ఆయన ఇప్పుడు జనసేనకు చాలా దగ్గరగా వుంటున్నారట. ఎంత దగ్గరగా అంటే, జనసేనకు ఫండింగ్ చేయడం, జనసేన వ్వవహారాలు కొన్ని తన ఆఫీసు నుంచి నడిపించడం, జనసేన మనుషులనే తన సినిమాకు కూడా నియమించడం వరకు అంట. హీరో తన మనిషిని పెట్టుకోమని చెప్పినా కాదని, జనసేన మనిషిని తేవడంతో ఆశ్చర్యపోవడం ఆ హీరో వంతయిందట. ఏమిటిదంతా? అని ఆ హీరో ఆరా తీసి, ఈ జనసేన లింక్ లు తెలిసాక, గమ్మున వున్నాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -