- Advertisement -

లాభాల‌తో ముగిసిని స్టాక్ మార్కెట్లు..

- Advertisement -

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలలో ముగిశాయి. సెన్సెక్స్‌ 292 పాయింట్లు లాభపడి 35,208 వద్ద ముగిసింది. నిఫ్టీ 97 పాయింట్లు లాభపడి 10,715 వద్ద ముగిసింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు చివరి వరకు జోరు కొనసాగించాయి.

ఆరంభంలో సెన్సెక్స్‌ వంద పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 31 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది. చివర్లో సూచీలు మరింతగా పైకి చేరాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 292.76పాయింట్ల లాభంతో 35208.14 పాయింట్ల వద్ద ముగిసి మూడు నెలల గరిష్ఠానికి చేరింది. నిఫ్టీ 97.20 పాయింట్ల లాభంతో 10715.50 పాయింట్లకు చేరింది.

ఫైనాన్షియల్‌, మెటల్స్‌, ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు లాభపడడంతో సూచీలు లాభాల బాటపట్టాయి. దేశీయ కంపెనీల షేర్ల కొనుగోళ్లు కూడా పెరిగాయి.

డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.15 వద్ద కొనసాగుతోంది. గెయిల్‌, ఎం అండ్‌ ఎం, యాక్సిస్‌ బ్యాంకు, హిందాల్కో, టాటా స్టీల్‌ తదితర కంపెనీల షేర్లు లాభపడ్డాయి. లుపిన్‌, డా. రెడ్డీస్‌ ల్యాబ్స్‌, టీసీఎస్‌, కోల్‌ ఇండియా, సిప్లా తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పీసీ జువెలర్స్ (37.90%), గ్రీవ్స్ కాటన్ (8.01%), ఫైజర్ లిమిటెడ్ (7.76%), జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (6.46%), వెల్స్ పన్ కార్పొరేషన్ (6.41%).

టాప్ లూజర్స్:
వోక్ హార్డ్ లిమిటెడ్ (-7.82%), ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (-7.30%), ఉజ్జీవన్ ఫైనాన్సియల్ సర్వీసెస్ (-5.91%), స్ట్రైడ్స్ షాసూన్ లిమిటెడ్ (-4.78%), రాజేష్ ఎక్స్ పోర్ట్స్ (-4.19%).

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -