- Advertisement -

రేవంత్ ఆస్తుల వెనుక చంద్ర‌బాబు హ‌స్తం ఉంది…

- Advertisement -

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్. ఫెమా, మనీ లాండరింగ్ చట్టాలను ఉల్లంఘించిన రేవంత్ రెడ్డి.. దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్, విజయ్ మాల్యాలకు ఏమాత్రం తీసిపోడని ఆరోపించారు. ఎన్ఇక‌ల క‌మిష‌న్‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా అఫిడవిట్లు సమర్పించినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడిచి రేవంత్ వేలకోట్లు సంపాదించాడని ఆరోపించారు. ఐటీ దాడుల విషయంలో కాంగ్రెస్ నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారని… ఈ వ్యవహారానికి టీఆర్ఎస్‌కు సంబంధం లేదన్నారు. నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్న జానారెడ్డి, జైపాల్ రెడ్డి ఇళ్లో ఏనాడు ఐటీ సోదాలు జరగలేదని అన్నారు.

వంత్ ఒక దేశద్రోహి అని.. ఇతని వ్యవహారంపై ఎలక్షన్ కమిషన్‌ను కలుస్తామని.. ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని కోరుతామన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో పట్టుకున్న రూ.50 లక్షల కారణంగా మొత్తం గుట్టు బయటకు తెలిసిందని సుమన్ అన్నారు. దేశభక్తుడిని అని చెప్పుకునే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దొడ్డి దారిలో డబ్బులు సంపాదించిన రేవంత్‌ను ఎలా సమర్థిస్తున్నారని ప్రశ్నించారు.

తెలంగాణ వనంలో రేవంత్‌ రెడ్డి కలుపు మొక్కని అభివర్ణించారు. ‘ఓటుకు కోట్లు కేసు’లో రేవంత్‌ అడ్డంగా దొరికాడని, అక్కడ దొరికిన 50 లక్షలపై ఆరా తీస్తే డొంకంత కదిలిందని తెలిపారు. రేవంత్‌ను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించి రాహుల్‌ గాంధీ తన సచ్చీలతను నిరూపించుకోవాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ స్టువర్ట్‌ పురం దొంగల ముఠాగా మారిందని విమర్శించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -