Wednesday, May 1, 2024
- Advertisement -

త్వ‌ర‌లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌… ఇద్ద‌రుఅవుట్‌.. ముగ్గురు కొత్త వారు ఇన్‌….

- Advertisement -

ఏపీలో కేబినేట్ విస్త‌ర‌ణ ఉండ‌ద‌ని లోకేస్ చెబుతున్నా…. మ‌రో వైపు బాబు కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. వ‌చ్చె ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని భారీ మార్పులు,చేర్పులు ఉండ‌బోతున్నాయి. అలిగేష‌న్స్ ఉన్న మంత్రుల‌ను తప్పించి కొత్త వారిని తీసుకొనేందుకు బాబు సిద్ధ‌మ‌య్యారు. కేబినెట్ ప్ర‌క్షాల‌న‌లో ఇద్ద‌రు అవుట్ లిస్టులో ఉంటే, ముగ్గురి పేర్లు ఇన్ లిస్టులో వినిపిస్తున్నాయి.

కేబినెట్ నుంచి అవుట్ అవుతోన్న వారి లిస్టులో ప్ర‌ధానంగా మంత్రి నారాయ‌ణ పేరుతో పాటు ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు పేరు లైన్లో ఉంది. ఈ లిస్ట్‌లో మూడో పేరు అఖిల ప్రియ ఉంటుందా అన్న వార్త‌లు వ‌స్తున్నాయి. న‌రాయ‌ణ‌మీద వ‌స్తున్న ఆరోప‌న‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌ను మంత్రి ప‌ద‌వినుంచి త‌ప్పింది నామినేటేడ్ ప‌ద‌వి ఇవ్వ‌నున్నారంట‌. ఆర్థిక మంత్రి య‌న‌మ‌లను త‌ప్పించి రాజ్య‌జ‌భ‌కు పంపుతార‌ని తెలుస్తోంది.

ఇక కొత్త‌గా కేబినెట్‌లోకి వ‌స్తార‌ని పేర్లు వినిపిస్తోన్న వారిలో ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ పేరు బ‌లంగా వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి గెలిచి ఆ త‌ర్వాత ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ నేప‌థ్యంలో టీడీపీలోకి జంప్ చేసేశారు. ఇక చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్ అండ‌తో గొట్టిపాటికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక అనంత‌పురం జిల్లాలో సీనియ‌ర్ లీడ‌ర్లుగా ఉన్న జేసీ సోద‌రుల‌ను సంతృప్తి ప‌రిచే క్ర‌మంలో తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ.ప్ర‌భాక‌ర్‌రెడ్డి పేరును కూడా కేబినెట్ రేసులో ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇక టీడీపీకి కంచుకోట లాంటి ప‌శ్చిమగోదావ‌రి జిల్లాలో ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యేగా ఉన్న విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ పేరు కూడా మంత్రి ప‌ద‌వి రేసులో ఉందంట‌. కేబినేట్ ప్ర‌క్షాల‌న స‌మ‌యానికి లిస్ట్‌లో మార్పులు, చేర్పులు చోటు చేసుకోవ‌చ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -