మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ టీమిండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాటింగ్‌లో భారత్ గొప్ప ఆటగాళ్లను అందించింది కాని బౌలర్లను మాత్రం అందించలేదన్నారు. ప్రస్తుతం టీమిండియాకు సూపర్ స్టార్ బౌలర్ కావాలన్నారు. భారత్ లో క్రికెట్ ఆడేవారందరి దృష్టి బ్యాటింగ్ మీదే ఉంటుంది కాని బౌలర్లపై ఉండదన్నారు. దానికి కారనం సూపర్ స్టార్ బౌలర్లు లేకపోవడమేన్నారు.
అయితె పాకిస్థాన్ మాత్రం అందుకు వ్యతిరేకమన్నారు. అక్కడి సూపర్ స్టార్లంతా పేస్ బౌలర్లేనని గుర్తు చేశాడు. ఇమ్రాన్ ఖాన్, వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ ఇలా పాక్ క్రికెట్ హీరోలంతా బౌలర్లేనని అన్నాడు. భారత్ క్రికెట్ ప్రపంచానికి బ్యాటింగ్ లో గొప్ప ఆటగాళ్లను అందించింది కానీ, బౌలింగ్ లో మాత్రం ఆస్థాయిలో అందించలేకపోయిందని ఆయన పేర్కొన్నాడు.
గతంలోకంటే ప్రస్తుతం పరిస్థితి బాగుందని, బుమ్రా, భువనేశ్వర్, ఉమేష్ లాంటి మ్యాచ్ మలుపు తిప్పే ఆటగాళ్లను చూస్తున్నామని తెలిపాడు. ఇది టీమిండియాకు శుభపరిణామమని అభిప్రాయపడ్డాడు. ఐతే బ్యాట్స్ మెన్ ను ఆరాధించినట్టు, బౌలర్లను కూడా ఆరాధించి అభిమానులే వారిని హీరోలుగా చేయాలని సూచించాడు. సమర్థుడైన బౌలింగ్ సూపర్ స్టార్ వస్తే తరువాతి తరాలకు స్పూర్తిగా నిలుస్తాడని మంజ్రేకర్ పేర్కొన్నాడు.
