Friday, May 17, 2024
- Advertisement -

విజయసాయిరెడ్డి సూపర్ స్కెచ్…… చింతమనేనిపై అనర్హత ఖాయం…. ఎన్నికలు పక్కా..

- Advertisement -

2014ఎన్నిలకు ముందు వరకూ జగన్ పార్టీలో చేరిన చాలా మంది సీనియర్ నాయకులు అందరూ కూడా పార్టీ కోసం వ్యూహాలు రచించడంలో మాత్రం ఘోరంగా ఫెయిల్ అయ్యారు. సీనియర్స్ మనోభావాలు దెబ్బతీయడం ఇష్టంలేని వైఎస్ జగన్ కూడా విజయసాయిపైన ఎంత అభిమానం ఉన్నా పార్టీలో మాత్రం ప్రముఖ స్థానం ఇవ్వలేకపోయాడు. అయితే 2014ఎన్నికల తర్వాత మాత్రం చాలా విషయాల్లో అవగాహనను పెంచుకున్నాడు జగన్. అందులో భాగంగానే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలాంటి విషయం ఉన్న నేతను బిఎసి ఛైర్మన్‌గా నియమించాడు. అలాగే వైఎస్‌ల కోసం ఏ స్థాయిలో కష్టపడడానికి రెడీగా ఉండే విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వడంతో పాటు పార్టీలో తన తర్వాత స్థానాన్ని ఇచ్చాడు. జగన్ నమ్మకాన్ని విజయసాయి పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటున్నాడు.

రాష్ట్రపతి ఎవరో బిజెపి ప్రముఖులకు కూడా తెలియకముందే విజయసాయికి తెలిసిపోయింది. ఆ విషయం చంద్రబాబును కూడా షాక్‌కి గురిచేసింది. విజయసాయి ఢిల్లీ లాబీయింగ్ పవర్ దెబ్బకు టిడిపి బ్యాచ్ అంతా కూడా ఆందోళన చెందుతున్నారన్నది నిజం. అందుకే సందర్భం వచ్చినప్పుడల్లా విజయసాయిని కార్నర్ చేయాలని చూస్తూ ఉంటారు. అయితే విజయసాయి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కచ్చితంగా అనర్హత వేటుపడేలా చేయడానికి వ్యూహం రచించాడు విజయసాయి. వైకాపా నుంచి టిడిపిలోకి జంప్ అయిన ఎమ్మెల్యేల విషయంలో టిడిపి అనైతిక రాజకీయాల పట్ల ప్రజల్లో ఏహ్యభావం వచ్చేలా చేయగలిగినప్పటికీ ……ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా మాత్రం చేయలేకపోయారు జగన్ అండ్ టీం. చంద్రబాబు ఆ స్థాయిలో అనైతిక ప్రవర్తనకు కట్టుబడ్డాడు మరి.

అయితే ఇప్పుడు దెందులూరు టిడిపి ఎమ్మెల్యే ప్రభాకర్‌కి శిక్ష పడిన నేపథ్యంలో విజయసాయి రాష్ట్రపతి స్థాయిలో వ్యూహం రచించాడు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ని కలవడంతో పాటు ఆ తర్వాత రాష్ట్రపతిని స్వయంగా కలిసి రాష్ట్రపతి చేత దెందులూరి ప్రభాకర్‌పై అనర్హత వేటు వేయించేలా ప్లాన్ చేస్తున్నాడు విజయసాయి. ఈ ప్రయత్నంలో విజయసాయి సక్సెస్ అయితే మాత్రం అది వైకాపాకు అది బెగ్గెస్ట్ బూస్ట్ అవుతుందనడంలో సందేహం లేదు. అలాగే చంద్రబాబు నాయుడు పూర్తి డిఫెన్స్‌లో పడడం ఖాయం. ఇంకా ఏడాదిపైగానే సమయం ఉండడంతో ఉప ఎన్నికలు కూడా వచ్చాయంటే మాత్రం చంద్రబాబుకు శిరోభారం ఖాయం. తప్పు చేసి శిక్షపడిన తన పార్టీ ఎమ్మెల్యేను ఎలా సమర్థించుకోవాలో? ప్రజలను ఓట్లు ఏమని అడగాలో తెలియని సందిగ్థతలో పడడం ఖాయం. శిక్ష పడిన టిడిపి ఎమ్మెల్యే దెందులూరి ప్రభాకర్‌పై అనర్హత వేటు పడేలా విజయసాయి పన్నిన వ్యూహాన్ని చంద్రబాబు ఎలా అడ్డుకుంటాడో చూడాలి మరి. ఎందుకంటే అనర్హత వేటు పడినా……..ఆ తర్వాత ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నైతికతపై అది చాలా పెద్ద దెబ్బే అవుతుందనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -