Thursday, May 2, 2024
- Advertisement -

ఆ ప్రశ్నలకు జనసేనాని ఏం చెబుతాడు

- Advertisement -

పవన్ పార్టీ జనసేన పురుడు పోసుకొని నాలుగేళ్ళు పూర్తయినా ప్రజల్లోకి రాలేదని పుట్టని బిడ్దకు “సొమలింగం” అని పేరు పెట్టినట్లు విధివిధానాలు ప్రకటించని ఆయన పార్టీపేరు “జనసేన” అని మాత్రమే అందరికి తెలుసు. ఆయన రాజకీయ సిద్ధాంతంగా ప్రకటించిన విషయాలు నీతి సూత్రాలుగా ఉన్నాయి కాని సిద్ధాంతాలు విధి విధానాలుగా కనిపించటం లేదని అంటున్నారు .”కులాలని కలిపే ఆలోచన విధానం …మతాల ప్రస్తావన లేని రాజకీయం….భాషల్ని గౌరవించే సాంప్రదాయం… సంస్కృతులుని కాపాడే సమాజం… ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం… ఇవి దేశపటిష్టతకు మూలాలు” ఇవే “జనసేన” సిద్ధాంతాలు.

అవి ఏమిటో? ఎలా వీటిని అమలు చేయగలరో? ఇంతవరకు పవన్ ప్రజలకు వివరించలేదు. ఇందులో కూడా ఆయన వైఫల్యం చెందినట్లే. సరే అన్నీ వదిలేసినా ఆయన జీవితం సంగతేమిటి.. మూడు పెళ్ళిళ్ళ సంగతేమిటి… అదీ ఒకసారి కాదు రెండుసార్లు… అంటే పవన్ జీవితమూ వైఫల్యమే కదా అంటున్నవారు లేకపోలేదు!. వివాహ జీవితాన్నే సరిగ్గా హాండిల్ చేసుకొలోని పవన్ ఐదు కోట్ల ప్రజల జీవితాలను ఎలా కాపాడుతారు? ఇది పవన్ అడగవలసిన ప్రశ్నగాదు సమాధానం చెప్పవలసిన ప్రశ్న అంటున్నారు. పవన్ వైజాగ్ వచ్చి హడావిడి చేయటాన్ని విడుదల కావలసి ఉన్న అఙ్జాతవాసి సినిమాకు అడ్వాన్స్ ప్రమోషనా? అంటున్నారు కొందరు ఆంధ్రులు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమస్య విషయంలోనైనా నరెంద్ర మోదీని వ్యక్తిగతంగా కలసి నిలదీయవచ్చుగదా? అవన్నీ కాకపోతే మీ పొలికేకలు పెట్టవచ్చు కదా అంటున్నారు .

క్లైమాక్సేమంటే పవన్ బద్ధశత్రువుగా భావించిన కేసిఆర్ ను కలవటం జనానికే మాత్రం ఆమోదయోగ్యంగా లేదట.పవన్ వ్యక్తిగత అవసరాలకు ప్రయోజనాలకు ప్రజల పేరుతో రాజకీయాన్ని అడ్డుపెట్టుకుంటున్నట్లు ఉందని కామెంట్స్ వచ్చాయి ఈ వ్యవహారం మీద . అంతేకాదు పవన్ ని కెటిఆర్ “ఎనిగ్మ” ఏదో? ఉందన్న తరవాత కూడా ఆయన సమాధానం చెప్పలేదంటే అసలు సమాధానమే లేదా? అర్ధం కాలేదా? అనుకుంటున్నారు. ఒక వ్యక్తిని “ఎనిగ్మా” అంటే అతనిలో ఏదో మర్మం ఉన్నట్లు. ఎవరికీ అర్ధంకాని రహస్య వ్యక్తిత్వం ఉందన్నట్లే భావం కదా! దీన్ని బట్తి ఉన్న మర్మమేదో ప్రజలకు అర్ధం కావటం కష్టమే. అది పవన్ వ్యక్తిత్వ లోపమా? మానసిక అవ్యవస్థనా? అంటున్నవారూ లేకపోలేదు . ఇన్ని ప్రశ్నలు ఇంటి వాకిట్లో పెట్టుకొని పవన్ ఎవర్నీ ప్రశ్నించలేక పోతున్నారని అంటున్నారు విశ్లేషకులు …

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -