Sunday, May 4, 2025
- Advertisement -

పవన్ భూతుపురాణం వెనుక.. అసలు వ్యూహమేంటి ?

- Advertisement -

ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు జనసేన పార్టీ మద్య జరుగుతున్నా రాజకీయ రగడతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ఇటీవల విశాఖలో జరిగిన కొన్ని పరిణామాలు ఇరు పార్టీల మద్య రాజకీయ వేడిని తారస్థాయికి తీసుకెళ్ళాయి. ఈ సంగతి అలా ఉంచితే విశాఖ ఘటన తరువాత జనసేన అధ్యక్షుడు పవన్ లోని మరో కోణం బయటకు వచ్చిందనే చెప్పాలి. మంగళగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

“వైసీపీ నాకోడకళ్ళారా.. సన్నసుల్లారా.. ” అంటూ ఇంకా చాలారకాలుగా పవన్ వాడిన అసభ్య పదజాలాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. పవన్ రాజకీయ ఆరంగేట్రం చేసిన తరువాత.. ఎప్పుడు లేని విధంగా వైసీపీ నేతల భూతు పదజాలలతో మండిపడ్డారు. ఎప్పుడు కూడా సహనాన్నిప్రదర్శించే పవన్ ఒక్కసారిగా ఎందుకు ఇలా మాట్లాడారు అనే దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ వ్యక్తిత్వాన్ని దిగజార్చే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయనేది చాలా మంది వాదన.

అధికార వైసీపీ నేతలు పవన్ పై ఎన్నో వ్యక్తిగత విమర్శలు చేసినప్పటికీ.. ఆయన మాత్రం ఎలాంటి భూతు పదాలు వాడకుండా తనదైన రీతిలో విమర్శలు చేసే వారు గతంలో. కానీ పవన్ ఇకపై తనలోని మరో కోణాన్ని బయటపెట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అధికార వైసీపీ ని ఎదుర్కోవాలంటే ” మాటకు మాట.. దెబ్బకు దెబ్బ ” అనే విధంగా పవన్ అగుడులు వేయబోతున్నట్లుగా స్పష్టమౌతోంది. మరి పవన్ ఒకవేళ ఇదే విధానంలో ముందుకు వెళ్తే..ఏపీ రాష్ట్ర రాజకీయాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం ఖాయం.

ఇవి కూడా చదవండి

జగన్ కు పెను సవాల్ గా రోడ్ల సమస్య.. ఎన్నికల్లో భారీ మూల్యం తప్పదా ?

తెలంగాణలో మరో బైపోల్.. ఈటెల వ్యూహాలు ఫలిస్తున్నాయా ?

ఉత్తరాంధ్రలో టీడీపీ జనసేన బ్యాన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -