Monday, April 29, 2024
- Advertisement -

తెలంగాణలో మరో బైపోల్.. ఈటెల వ్యూహాలు ఫలిస్తున్నాయా ?

- Advertisement -

ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు రాజకీయం ఎంత రసవత్తరంగా ఉందో అందరికీ తెలిసిందే. మూడు ప్రధాన పార్టీలు అయిన టి‌ఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఈ ఉపఎన్నిక ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అంతే కాకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్నాయి. దాంతో గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణలో మరో ఉపఎన్నికకు రాబోతుందా ? ఈ సారి అధికార పార్టీకి భారీ షాక్ తగలనుందా ? అంటే అవుననే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మునుగోడులో గెలుపు కోసం నానా ఫిట్లు చేస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు.

ఈ నేపథ్యంలో అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీకి అనుకోని షాక్ తగిలింది. టి‌ఆర్‌ఎస్ సీనియర్ నేత భువనగిరి మాజీ ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే మునుగోడు టికెట్ నర్సయ్య ఆశించినప్పటికి టి‌ఆర్‌ఎస్ అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే నర్సయ్యకు బీజేపీ భువనగిరి ఎంపీ టికెట్ ఆఫర్ చేయడంతోనే ఆయన టి‌ఆర్‌ఎస్ వీడి కాషాయ కండువా కప్పుకొనున్నారని మరో వాదన కూడా నడుస్తోంది. ఇక నర్సయ్య దారిలోనే మరికొంత మంది టి‌ఆర్‌ఎస్ నేతలను బీజేపీ వైపు తిప్పుకునేందుకు చేరికల కమిటీ చైర్మెన్ ఈటెల రాజేందర్ గట్టి ప్రణాళికాలే సిద్దం చేస్తున్నారట. ముఖ్యంగా పార్టీలో అసమ్మతి నేతలపైనే ఈటెల గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఇక వినిపిస్తున్న వార్తల ప్రకారం భువనగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి త్వరలోనే బీజేపీ గూటికి చేరబోతున్నారనే వాదన ఈ మద్య విపరీతంగా వినిపిస్తోంది.

అయితే తను పార్టీ మారే ప్రసక్తే లేదని ఫైళ్ళ శేఖర్ రెడ్డి స్పష్టం చేసినప్పటికీ ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు. మరో టి‌ఆర్‌ఎస్ నేత కర్నే ప్రభాకర్ కూడా టి‌ఆర్‌ఎస్ వీడనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిల్లోనూ అధికరంలోకి రావాలని చూస్తున్న బీజేపీ.. ఇతర పార్టీలలోని ముఖ్య నాయకులను కాషాయ పార్టీలో కలిపేసుకునేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు కమలనాథులు. ఇప్పటికే కోమటిరెడ్డి లాంటి బలమైన నేతలను తమ పార్టీలో కలిపేసుకోవడంలో సక్సస్ అయ్యారు కమలనాథులు. ఇక చేరికల కమిటీ చైర్మెన్ గా ఉన్న ఈటెల వ్యూహాలకు పదును పెడుతూ.. మరికొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై గురిపెట్టరాట. ఇక ఇప్పటికే భారీ ఎత్తున చేరికలు ఉండబోతున్నాయని ఆయా సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఈటెల. మరి ఈటెల వ్యూహాలు ఫలిస్తే.. తెలంగాణలో ఎన్నికలకు ముందే మరో బైపోల్ రావడం ఖాయమంటున్నాయి రాజకీయ వర్గాలు.

ఇవి కూడా చదవండి

జగన్, బాబు కక్ష్య రాజకీయాలు.. ప్రజల షాక్ ఎవరికి ?

జగనన్న” సినిమా “.. అదిరిపోయే ప్లాన్ ?

చంద్రబాబు vs సీనియర్ ఎన్టీఆర్.. తప్పు ఎవరిది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -