Saturday, May 4, 2024
- Advertisement -

ఉత్తరాంధ్రలో టీడీపీ జనసేన బ్యాన్..!

- Advertisement -

పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా నేడు విశాఖపట్నంలో నాన్ పోలిటికల్ జె ఏ సి ఆద్వర్యంలో విశాఖ గర్జన ” పేరుతో ర్యాలీ నిర్వహించింది వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, మంత్రులు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. గత నాలుగైదు రోజులుగా ఈ గర్జన కు సంబంధించి వైసీపీ నేతలు నానా హంగామా చేశారు. ఎట్టకేలకు జోరు వానలో కూడా గర్జన ర్యాలీని విజయవంతం చేశారు వైసీపీ నేతలు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రస్తుత మంత్రులు, మాజీ మాజీ మంత్రులు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతాలను గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని, చంద్రబాబు ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు.

ఇక మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విశాఖను రాజధాని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని.. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ఏర్పడడానికి కృషి చేస్తామని కొడాలి చెప్పుకొచ్చారు. ఇక ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర పై కొందరు కుట్ర పన్నుతున్నారని, అలాంటి వారిని సహించేది లేదని నాని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఉతరాంధ్రలో ఈనాడు, ఏబీఎన్. వంటి ప్రసార మాద్యమలను పూర్తిగా బ్యాన్ చేయండి అంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. అలాగే టీడీపీ, జనసేన పార్టీలను కూడా ఉత్తరాంధ్రలో పూర్తిగా నిషేదించి, ఆ పార్టీకి చెందిన వాళ్ళు ఈ ప్రాంతంలో అడుగుపెట్టకుండా చేయాలని కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే సోషల్ మీడియాలో కొడాలి నాని వ్యాఖ్యలపై. నెటిజన్స్ బిన్నంగా స్పందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -