Sunday, May 4, 2025
- Advertisement -

జగన్ కు బీసీలపై ప్రేమ ఎందుకు ?

- Advertisement -

ఏపీలో కుల రాజకీయాలు కొత్తేమీ కాదు.. మొదటి నుంచి కూడా కుల సమీకరణలను బేరీజు వేసుకొని వ్యూహాలు రచిస్తున్నారు రాజకీయ నేతలు. ముఖ్యంగా రాష్ట్రంలో మెజారిటీ ఓటు బ్యాంకు కలిగిన సామాజిక వర్గాలను ఆకర్శించేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంటారు. అలా కుల సమీకరణల ఆధారంగా ప్రజలను ఆకర్షించడంలో ఇటు టీడీపీ, అటు వైసీపీ ఎప్పుడు కూడా పోటీ పడుతూనే ఉంటాయి. ఎన్నికల సమయంలో ఆయా ప్రాంతాలలోని సామాజిక వర్గాల ఆధారంగా తమ అభ్యర్థులను నిలబెడుతుంటాయి ఈ రెండు పార్టీలు.

ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మద్యే అయినప్పటికి జనసేన ఎంట్రీతో ఆయా సామాజిక వర్గాల ఓటు బ్యాంక్ ను పవన్ చీల్చరానే చెప్పవచ్చు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ను పవన్ చాలా వరకు తనవైపు తిప్పుకున్నారు. దాంతో మిగిలిన సామాజిక వర్గ ఓటు బ్యాంక్ కోసం చంద్రబాబు, జగన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ పవన్ చంద్రబాబు కలిస్తే ఆయా సామాజిక వర్గాలలో సమీకరణలు మారిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గాన్ని పూర్తిగా తనవైపు తిప్పుకునేందుకు జగన్ గట్టిగానే ప్రణాళికలు వేస్తున్నారు. బీసీ ఆయా కులాల సమ్మేళనం కావడంతో.. బీసీ సామాజిక వర్గంలో పట్టు సాధిస్తే.. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ కు తిరుగుండదనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా బీసీలను పూర్తి స్థాయిలో ప్రభావితం చేసే బలమైన నాయకులు కూడా ఆ సామాజిక వర్గంలో లేకపోవడంతో.. ఈ సారి బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వచ్చే ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంక్ ను కొల్లగొట్టేందుకు జగన్ ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల రాజసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే జగన్ బీసీ సామాజికవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు స్పష్టంగా అర్థమౌతుంది. బీసీ అభివృద్దికి జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆర్ . కృష్ణయ్య ఇటీవల చెప్పుకొచ్చారు. అంతే కాకుండా బీసీ బిల్లు అమలు విషయంలో జగన్ చోరువ చూపడం పై కూడా కృష్ణయ్య పొగడ్తలు కురిపించారు. బీసీ ఓటు బ్యాంకు ను తన గుప్పిట్లో పెట్టుకుంటే.. ప్రత్యర్థులపై పైచేయి సాధించడంలో జగన్ సక్సస్ అయ్యే అవకాశం ఉంది. మరి జగన్ బీసీలపై చూపిస్తున్న.. ప్రేమ ఓటుగా మారుతుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

టీడీపీ, బీజేపీ మద్య వారధి గా జనసేనాని !

టి‌ఆర్‌ఎస్ పై బీజేపీ చేస్తోన్న కుట్రలు నిజమేనా ?

“కెమెరా మాతాకి జై “.. మోడీ కెమెరా ఫోజులు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -