Thursday, May 2, 2024
- Advertisement -

“కెమెరా మాతాకి జై “.. మోడీ కెమెరా ఫోజులు !

- Advertisement -

గత ఎనిమిదేళ్లుగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాడు. ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మోడీ.. సహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో తన తరువాతే ఎవరైనా చాలా సందర్భాలలో నిరూపించారు. అయితే మోడీ తీసుకునే నిర్ణయాలను ప్రశంశించే వారు ఉన్నట్లే.. ఆయన వ్యవహారశైలిని విమర్శించేవారు కూడా లేకపోలేదు. మోడీ వేసుకునే బట్టలపై తరచూ విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. లక్షల విలువ చేసే సూట్లను ధరించడం ఒక్క మోడీకే సాధ్యం. ఇక నలుగురిలో ఉన్నప్పుడూ ఆయన మాత్రమే ప్రత్యేకంగా కనిపించేందుకు ఆరాటపడుతుంటారు.

కెమెరాలకు ఓపికగా ఫోజులివ్వడం, కెమెరాల ఫోకస్ తనపైనే ఉండేలా చూసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ప్రధాని హోదాలో ఉన్న మోడీ పబ్లిసిటీ కోసం ఇంత ఆరాటం ఎందుకు ? అని కొన్ని సందర్భాలలో విమర్శలు కూడా వస్తూంటాయి. ఇక తాజాగా ఇలాంటి సందర్భన్నే మోడీ కి సంబంధించిన ఓ వీడియోను అడ్వికెట్ జనరల్ ప్రశాంత్ భూషణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ” కెమెరా మాతాకి జై .. అంటూ మోడీ వ్యవహార శైలిపై వ్యంగ్యంగా రాసుకొచ్చారు. ఆ వీడియోలో మోడీ కెమెరాల కు సైగ చేస్తూ, అటు పక్క వచ్చే వారిని దూరంగా పొమ్మని.. తను మాత్రమే ఫోకస్ అయ్యే విధంగా మోడీ వ్యవహరిస్తుండడంతో.. ఈ సన్నివేశంపై ప్రశాంత్ భూషణ్ పై విధంగా వ్యంగ్యంగా స్పందించారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ చేసిన ఈ వీడియో సామాజిక మద్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

నగ్నంగా విడియోకాల్ మాట్లాడినప్పుడు.. మహిళా కమిషన్ ఎక్కడ ?

జగన్ గెలవకపోతే రాజీనామా చేస్తా పక్కా !

బీజేపీకి పవన్ స్ట్రోక్.. వాట్ నెక్స్ట్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -