Friday, May 3, 2024
- Advertisement -

టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ భారీ కుట్ర నిజమేనా ?

- Advertisement -

ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక వేళ తెలంగాణలో రాజకీయ వేడి తీవ్రంగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు అన్నీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ ను బలంగా అమలు చేస్తున్నాయి. అధికార టి‌ఆర్‌ఎస్‌ పార్టీలోని కొందరు కీలక నేతలు బీజేపీలో చేరడం, అలాగే బీజేపీకి చెందిన కొందరు నేతలు టి‌ఆర్‌ఎస్ గూటికి చేరడం వంటి పరిణామాలు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో బీజేపీ మనీ డీల్ చేస్తోందనే వార్తలు బయటకు రావడంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గతంలో టీడీపీ తరుపున రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఎంత సంచలనంగా మారిందో సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఎన్నికల వేళ ఇలాంటి అంశమే తెరపైకి రావడంతో చర్చనీయంగా మారింది.

అయితే టి‌ఆర్‌ఎస్ నేతలలో బేరసారాలు కుదుర్చుకోవడానికి బీజేపీ నేజంగానే ప్లాన్ చేసిందా ? ఒకవేళ ఇది నిజమే అయితే బీజేపీ నేతలను ట్రాప్ చేసిందేవరు ? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్ హస్ లో జరిగిన మొత్తం సీన్ లో మరో ముగ్గురు టి‌ఆర్‌ఎస్ ఎమ్మేల్యేలు, ఇద్దరు స్వామీజీలు, నందకుమార్ అనే వ్యాపారవేత్త ఉన్నారు. టి‌ఆర్‌ఎస్ లో షిండేలను సృష్టిస్తామని బీజేపీ మొదటి నుంచి చెబుతోందని, అందుకు తగ్గట్టుగానే టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు డబ్బుతో ప్రలోభ పెడుతోందని టి‌ఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే టి‌ఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు బీజేపీ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది.

ఇదంతా ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో కే‌సి‌ఆర్ చేస్తోన్న నాటకం అంటూ బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఎత్తి చూపిస్తూ.. బీజేపీ మనీ ప్రలోభలకు పాల్పడుతోందనే విషయాన్ని నొక్కి చెప్పారు రేవంత్ రెడ్డి. ” కొన్ని జిల్లాలకు చెందిన ఎమ్మేల్యేలు తమతో టచ్ లో ఉన్నారని రఘునందన్ రెడ్డి చెప్పడంతో.. తొందరపడి ఒక కోకిల ముందే కూసింది అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మొత్తానికి తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక సమరం.. సార్వత్రిక ఎన్నికలను తలపించేలా రాజకీయ కాక రేపుతోంది.

ఇవి కూడా చదవండి

టీడీపీ, బీజేపీ మద్య వారధి గా జనసేనాని !

జగన్ను చిక్కుల్లో నెట్టిన త్రీ క్యాపిటల్స్ !

బీజేపీకి పవన్ స్ట్రోక్.. వాట్ నెక్స్ట్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -