Sunday, May 12, 2024
- Advertisement -

టీడీపీ, బీజేపీ లను పవన్ కలుపుతారా ? జనసేనాని ఏం చేయబోతున్నాడు ?

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో పొత్తుల అంశం విశాఖ ఘటన తరువాత మరింత పెరిగిందనే చెప్పాలి. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో అడ్డుకోవాలంటే.. అన్నీ పార్టీలు ఏకం కావాలని అటూ టీడీపీ ఇటు జనసేన ఒకే పంథాన్ని అనుసరిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల మద్య పొత్తు ఉండే అవకాశం ఉందని మొదటి నుంచి వార్తలు వస్తున్నప్పటికి, ఎవరికి వారు సింగిల్ గానే పోటీ చేస్తామంటూ ఆ మద్య చెప్పుకొచ్చారు. అయితే విశాఖ ఘటన తరువాత ఎవరు ఊహించని విధంగా చంద్రబాబు పవన్ కు మద్దతు గా సంఘీభవం తెలపడంతో ఈ రెండు పార్టీల పొత్తు దాదాపు ఖాయమే అనే భావనకు వచ్చారంతా. అయితే జనసేన మొదటినుంచి బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతూ వస్తోంది.

కానీ బీజేపీ టీడీపీతో కలిసి నడిచేందుకు ఆసక్తి చూపడం లేదు. పొత్తు విషయంలో టీడీపీతో ఏ మాత్రం కలిసే ప్రసక్తే లేదని కమలనాథులు చాలా సందర్భాల్లో స్పష్టం చేశారు కూడా. దీంతో జనసేన టీడీపీ కలిస్తే బీజేపీ దూరంగా ఉండే అవకాశం ఉందని కొందరి విశ్లేషకులు చెబుతున్నారు. కానీ బీజేపీ మాత్రం పవన్ను దూరం చేసుకోవడానికి సిద్దంగా లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ పవన్ తో కలిసి నడవలని చూస్తోంది. ఈ నేపథ్యంలో అటూ టీడీపీకి గాని, ఇటు బీజేపీకి గాని జనసేన చాలా కీలకం. దాంతో పవన్ వారధి గా ఉండి బీజేపీ, టీడీపీ లను కలిపే ప్రయత్నం చేస్తారా అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కూడా కేంద్రంలో బీజేపీ అధికరంలోకి వచ్చే అవకాశాలే అధికం.

దీంతో బీజేపీని దూరం పెడితే నష్టంవచ్చే అవకాశం ఉండడంతో టీడీపీ జనసేన బీజేపీ త్రిముఖ పొత్తు కోసం పవన్, చంద్రబాబు అరతపడుతున్నారు. అయితే గత ఎన్నికల సమయంలో చంద్రబాబు మోడి పై చేసిన విమర్శలు, బీజేపీ పై చూపిన విముఖతను దృష్టిలో ఉంచుకొని కమలనాథులు టీడీపీని దూరంగా ఉంచుతున్నారు. అయితే పవన్ తో స్నేహం బీజేపీకి చాలా అవసరం.. ఏపీలో ఏ మాత్రం పట్టులేని బీజేపీకి పవన్ దోస్తీని విడిస్తే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. దాంతో పవన్ కోరితే బీజేపీ త్రిముఖపొత్తుకు సై అనే అవకాశాలు ఉన్నాయి. అదే గనుక జరిగితే 2014 ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందని వారి అంచనా. మరి పవన్ వారధిగా టీడీపీ బీజేపీలను కలపడానికి ఎలాంటి ప్రణాళికలు వేస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

జగన్ను చిక్కుల్లో నెట్టిన త్రీ క్యాపిటల్స్ !

కాంగ్రెస్ లో కట్టప్ప.. వెన్నుపోటు తప్పదా ?

ఎన్ని అడ్డంకులు వచ్చిన విశాఖనే.. రాజధాని !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -