ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసే వ్యాఖ్యలు అప్పుడప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంటాయి. అమరావతి విషయంలోనైనా, స్కూల్స్ విలీనం విషయంలోనైనా లేదా మూడు రాజధానుల విషయంలోనైనా ఇలా చాలా అంశాలపై బొత్స చేసే వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల్లోనే కాకుండా వైసీపీ పార్టీ లో కూడా చర్చకు దారితీస్తూ ఉంటాయి. ఇక తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ పార్టీలో అంతర్మదానానికి గురి చేస్తున్నాయి. మంగళవారం తాడేపల్లి ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొత్స పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. .
తమ ప్రభుత్వం విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తోందని, చెప్పుకొచ్చారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం ” నాడు నేడు ‘ పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి పిల్లల భవిష్యత్ బాగుండాలని ఎన్నో సంస్కరణలు చేపడుతున్నామని, అవి ఫలితాలు ఇవ్వకపోతే తామే నష్టపోతామని చెప్పుకొచ్చారు. ప్రతిసారి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదని బొత్స స్పష్టం చేశారు. ప్రధాని మోడి అర్ధరాత్రి నోట్లు రద్దు చేసినప్పుడు ప్రజలకు చెప్పి చేయలేదని, అదే విధంగా తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదని బొత్స వ్యాఖ్యానించారు.
ఆ సంస్కరణలు సరైన ఫలితాలు ఇవ్వకపోతే ఎన్నికల్లో తమ ప్రభుత్వమే నష్టపోతుందని చెప్పుకొచ్చారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలిటికల్ సర్కిల్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి హోదాలో ఉన్న బొత్స కు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై స్పష్టమైన అవగాహన లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు ? తమ విధానాలు బాగలేకపోతే.. తమకే ఎన్నికల్లో నష్టం అని చెప్పడం ఏంటని వైసీపీ శ్రేణుల్లో కూడా చర్చ జరుగుతుందట. ఇలా నిలకడ లేని సమాధానాల వల్ల వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉందని వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్న మాట. ఇలా అస్థిరమైన సమాధానాల వల్ల రాబోయే రోజుల్లో జగన్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. మరి బొత్స వ్యాఖ్యలపై వైఎస్ జగన్ రియాక్ట్ అవుతారా లేదా అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి