Monday, April 29, 2024
- Advertisement -

కోమటిరెడ్డిని చిక్కులో పడేసిన.. రాహుల్ జోడో యాత్ర !

- Advertisement -

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నప్పటికి.. ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు టాటా చెప్పిన తరువాత వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని వార్తలు గట్టిగానే వినిపించాయి. అయితే తాను కాంగ్రెస్ నూ విడిచే ప్రసక్తే లేదని, రాజకీయాల్లో ఉన్నంత కాలం కాంగ్రెస్ తోనే ఉంటానని వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. ఇక మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. బీజేపీలో చేరిన తరువాత రాజగోపాల్ రెడ్డి టీకాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. .

ఆయన బ్రదర్ వెంకటరెడ్డి కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై ఘాటుగానే విమర్శలు చేశారు. దాంతో కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సస్ టీకాంగ్రెస్ నేతలకు మద్య గట్టిగానే వార్ నడిచింది. అయితే కాంగ్రెస్ లోనే ఉంటూ ఆ పార్టీకి వ్యతిరేకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రవర్తిస్తుండడంతో ఆయన పార్టీ వీడాలని టీకాంగ్రెస్ నేతలు బహిరంగంగానే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్ నూ విడిచే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఇదిలా ఉండగా ” మునుగోడులో కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదని.. తన తమ్ముడికి ఓటు వేయాలని ” వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు టీకాంగ్రెస్ లో పెను ప్రకంపనలే సృష్టించాయి. దీంతో ఆయనకు షోకాజ్ నోటీసుకు కూడా జారీ చేసింది కాంగ్రెస్ అధిష్టానం.

ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హైదరబాద్ లో జరుగుతున్నా సంగతి తెలిసిందే. ఆ మద్య ఆస్ట్రేలియా వెళ్ళిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా హైదరబాద్ చేరుకున్నారు. దీంతో వెంకటరెడ్డి జోడో యాత్రలో పాల్గొంటారా ? లేదా అనే ప్రశ్నలు వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జోడో యాత్రకు వెంకటరెడ్డి దూరంగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే పార్టీలో యాక్టివ్ గా ఉండేందుకు వెంకటరెద్దే ఏమాత్రం సిద్దంగా లేరని తెలుస్తోంది. దీంతో అటు పార్టీని విడిచిపెట్టలేక అలాగని పార్టీలో కొనసాగలేక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇబ్బంది పడడంతో పాటు టీకాంగ్రెస్ నేతలను కూడా ఇబ్బంది పెడుతున్నారనేది జగమెరిగిన సత్యం.

ఇవి కూడా చదవండి

జగన్ సర్కార్ కు.. హైకోర్టు టార్గెట్ చేసిందా ?

మునుగోడు వార్.. గెలుపెవరిది !

కాంగ్రెస్ తో కే‌సి‌ఆర్ పొత్తు.. ఇంతకీ రాహుల్ నిర్ణయం ఏంటి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -