Monday, April 29, 2024
- Advertisement -

మునుగోడు వార్.. గెలుపెవరిది !

- Advertisement -

గత కొన్ని రోజులుగా తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక పెంచుతున్న హీట్ అంతా ఇంత కాదు. మూడు ప్రధాన పార్టీలు కూడా గెలుపు కోసం నానా పాట్లు పడుతున్నాయి. టి‌ఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇలా మూడు పార్టీలకు కూడా ఈ ఉపఎన్నికలో గెలవడం చాలా ముఖ్యం . అందుకే మునుగోడు చుట్టూ అలుముకున్న రాజకీయ వేడి తారస్థాయిలో కొనసాగుతోంది. ముఖ్యంగా టి‌ఆర్‌ఎస్ బీజేపీ మద్య కొనసాగుతున్న పోటీ తత్వం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పార్టీ నేతల కొనుగోలు విషయం, ఓటర్లకు నగదు పంపిణీ, బంగారం, చీరలు, వివిద రకాల వస్తువులు.. ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల తాయిలలు ఈ రెండు పార్టీలనుంచి మునుగోడు ప్రజలకు గట్టిగానే అందాయి. .

ఇక మునుగోడు ఓటర్లు కూడా ” ఏ పార్టీ ఇచ్చిన తీసుకుంటాం.. నచ్చిన పార్టీకే ఓటు వేస్తాం ” అనే సూత్రాన్ని పాటిస్తున్నారు. దాంతో గత కొన్ని రోజులుగా మునుగోడులో జాతర వాతావరణం కనిపించింది. ఇక నవంబర్ 1న ప్రచారానికి తెరపడగా.. 3న పోలింగ్ జరగనుంది. ఇక ఇప్పుడు అందరిలోనూ ఒకటే ప్రశ్న.. మునుగోడులో జెండా పాతేదీ ఎవరని ?.. బలాబలాల విషయానికొస్తే కాంగ్రెస్, టి‌ఆర్‌ఎస్, బీజేపీ మూడు పార్టీలు కూడా సమపాళ్లలో నిలిచినప్పటికి.. ప్రధాన పోరు మాత్రం బీజేపీ, టి‌ఆర్‌ఎస్ మద్యనే ఉండే అవకాశం ఉండని వివిద సర్వేలు చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్, బీజేపీ తో పోలిస్తే టి‌ఆర్‌ఎస్ కు కాస్త గెలుపు అవకాశాలు ఎక్కువ అనే వాదన కూడా వినిపిస్తోంది.

ఎందుకంటే ఆ పార్టీకి అధికార బలంతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ కూడా తొడవ్వడంతో కాస్త మెరుగైన ఫలితాలు రాబట్టే అవకాశం ఉండని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగని బీజేపీని, కాంగ్రెస్ ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే బీజేపీ అభ్యర్థిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడులో తిరుగులేని నేతగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ కు మునుగోడు కంచుకోట అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు పార్టీల మద్య టఫ్ వార్ జరిగే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. సర్వేల ఫలితాలు ఎలా ఉన్నప్పటికి.. ఓటర్ నాడీ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

ఎన్నికల ఖర్చు : అక్కడ 2 లక్షలే.. ఇక్కడ 400 కోట్లు ?

కుప్పంలో అరాచకం ఎవరిది.. చంద్రబాబు దా ? జగన్ దా ?

కే‌సి‌ఆర్ మాస్టర్ ప్లాన్ కు.. ఎంతటి వారైనా చిక్కల్సిందే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -