Thursday, May 23, 2024
- Advertisement -

జ‌గ‌న్ అంటే చంద్ర‌బాబుకు భ‌యం..ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

- Advertisement -

వైఎస్ జగన్ అంటే చంద్రబాబుకు భయం అని తెలుగునాట రాజకీయాలను ఫాలో అయ్యేవాళ్ళందరికీ తెలుసు. కానీ ఆ భయం ఏ స్థాయిలో ఉంటుంది? వైఎస్ జగన్ అంటే చంద్రబాబుకు ఎందుకంత భయం అనే విషయాలను ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకూ కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నా, వైఎస్ జగన్ పేరు విన్నా చంద్రబాబు, లోకేష్ అండ్ బ్యాచ్‌కి వెన్నులో వణుకు పుడుతుందని వైకాపా నాయకులు వ్యంగ్యంగా కామెంట్స్ చేసేవారు. కానీ అనుక్షణం జగన్‌ని టార్గెట్ చేస్తూ నారావారి రాజకీయాలు ఉంటాయన్నది నిజం. జగన్ అంటే చంద్రబాబుకు భయం అని ఇప్పటికే విశ్లేషకులు కూడా చాలా సార్లు చెప్పారు.

తాజాగా ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. 2014 ఎన్నికలకు ముందు ముఫ్ఫై ఏళ్ళ అనుభవం, సీనియర్ మోస్ట్ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబుకు మోడీ మేనియా సపోర్ట్ ఉన్నా కూడా జగన్‌తో పోటీలో గెలవలేనన్న భయం పట్టుకుని స్వయంగా పవన్ మద్దతు కోసం ఆయన ఇంటికి వెళ్ళిన విషయం తెలిసిందే. ఆ భేటీలో వైఎస్ జగన్ గురించి చెప్తున్నప్పుడు చంద్రబాబులో తనకు తీవ్రస్థాయిలో భయాందోళనలు కనిపించాయని చెప్పుకొచ్చాడు ప‌వ‌న్‌. వైఎస్ జగన్ అంటే చంద్రబాబుకు దడ అని చెప్పాడు. జగన్ గెలిస్తే చంద్రబాబుతో పాటు ఆయన భజన మీడియా అందరికీ కూడా ఇక రాజకీయ ప్రాముఖ్యత ఉండదన్న ఆందోళనలు ఉన్నాయట. ఆ ఒక్క మీటింగ్‌లోనే కాదు ………..ఆ తర్వాత చంద్రబాబును కలిసిన ప్రతిసారి జగన్ అంటే చంద్రబాబుకు ఉన్న భయాందోళనలు నాకు చంద్రబాబు కళ్ళలో చాలా స్పష్టంగా కనిపించాయని చెప్పుకొచ్చాడు పవన్.

ఇదండీ వైకాపా మాకు పోటీనే కాదు…..జగన్‌ని మేం అసలు గుర్తించడం లేదు అని తరచుగా చెప్పే మాటలకు వాస్తవాలకు ఉన్న వ్యత్యాసం. ఇక ఆ మధ్య చినబాబు లోకేష్ కూడా 2019 ఎన్నికల్లో జగన్‌ని కూడా ఓడిస్తాం. జగన్ మాకు పోటీనే కాదు. మొత్తం 200 సీట్లలో గెలుస్తాం అని భారీ స్టేట్మెంట్ ఇచ్చాడు. అఫ్కోర్స్ ఉన్నది 175 సీట్లే అన్న విషయం తెలియని అమాయక నాయకుడే అనుకోండి. కాకపోతే మనసులో మాత్రం జగన్ అంటే ఈ స్థాయి భయాందోళనలు పెట్టుకుని పైకి మాత్రం ఓ స్థాయిలో అబద్ధపు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం మాత్రం బాబు అండ్ బ్యాచ్‌కే చెల్లింది అన్న విశ్లేషణలు మాత్రం వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -