- Advertisement -

నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండేలా పాలిస్తా..

- Advertisement -

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెద్దాపురంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.కాంట్రాక్టర్లతో కమీషన్ గురించి మాట్లాడేందుకే ముఖ్యమంత్రి ప్రతి సోమవారం పోలవరం వెళుతున్నారని… ప్రాజెక్ట్‌లో అంతులేని అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అవినీతి కారణంగా పోలవరం పనులు మందకొడిగా సాగుతున్నాయన్నారు.

జ‌గ‌న్ అనే ..నేన అంటూ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సంచ‌ల‌న హామీ ఇచ్చారు. వుడి ఆశీర్వాదం, ప్రజల దీనెనలతో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి, అధికారంలోకి వస్తే ఒక్క మందు షాపు కూడా లేకుండా చేస్తానని హామీ యిస్తున్నానని అన్నారు.

2018 లోనో లేదా 2019 లోనో ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత ఐదేళ్లకు 2024లో మళ్లీ ఎన్నికలు జరుగుతాయి. జగన్ అనే నేనుగా.. మళ్లీ 2024లో జరిగే ఎన్నికల కోసం మీ దగ్గరకు వచ్చే సరికి ఒక్క మందు షాపు కూడా కనపడకుండా చేస్తానని హామీ ఇస్తున్నాను. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చడం కోసం బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, దీవించమని, తోడుగా ఉండమని ప్రాధేయపడుతున్నాను’ అని జగన్ అన్నారు.

ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ దగ్గరకి వచ్చి కేజీ బంగారం, బెంజి కారు ఇస్తానంటారని ఆయన మాటలు నమ్మవద్దని.. మనస్సాక్షిని నమ్మి ఓటేయాలని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. నాన్న ప్రజల కోసం ఒకడుగు ముందుకేస్తే.. నేను రెండడుగులు ముందుకేస్తానని.. వైఎస్ ఫోటో పక్కన నా ఫోటో ఉండేలా పరిపాలన చేస్తానని ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -