Tuesday, May 7, 2024
- Advertisement -

మైనింగ్ ఆరోప‌న‌లు…య‌ర‌ప‌తినేనిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసి హైకోర్టు

- Advertisement -

గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు బుధవారం హైకోర్టు షాక్ ఇచ్చింది. మైనింగ్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మైనింగ్ విషయమై బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది.

మైనింగ్‌ విషయంలో ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా యరపతినేని వ్యవహరిస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది. మైనింగ్ చేస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడం విషయమై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనింగ్ పన్నులను ఎందుకు వసూలు చేయలేదో చెప్పాలని కోర్టు అధికారులను ప్రశ్నించింది.

ఈ నేపథ్యంలో యరపతినేనిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీబీఐ, కాగ్, కేంద్ర మైనింగ్ శాఖను ప్రతివాదులుగా కోర్టు చేర్చింది. ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిల్లిందో కాగ్ తో దర్యాప్తు జరిపిస్తామని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 21కు వాయిదా వేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -