Wednesday, May 22, 2024
- Advertisement -

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెలుపును డిసైడ్ చేసేది గ్రామీణ ప్రాంతాలేనా….?

- Advertisement -

వచ్చే ఎన్నికల్లో అధికారం అందుకునేందుకు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసినట్లే కనబడుతోంది. అందుకే అధికారంలోకి రావటానికి జగన్ ఆఖ‌రి అస్త‌రంగా పాద‌యాత్ర‌ను ఎంచుకున్నారు. పాద‌యాత్ర‌కు అనుకోని రీతిలో విశేష స్పంద‌న వ‌స్తోంది. జ‌గ‌న్ పాదయాత్ర చూస్తే ఎక్కువ‌గా రూర‌ల్ ప్రాంతాల‌పైనే దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది.

కడపజిల్లాలో మొదలైన పాదయాత్ర అనంతపురం జిల్లా చివరిదశకు వచ్చేసింది. ప్రస్తుతం కదిరి నియోజకవర్గంలో ఉన్న జగన్ 26వ తేదీన చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోకి ప్రవేశిస్తున్నారు. కడప, కూర్నలు ,అనంతపురం జిల్లాల్లో పాద‌యాత్ర అంతా రూరల్ నియోజకవర్గాల్లోనే ఎక్కవుగా జరిగింది. ఎందుకంటే, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సుమారు 110 గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలే.

వైసిపికి మొదటినుండి పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పట్టెక్కువ అని వైసిపి నేతలే చెబుతున్నారు. మొన్న జరిగిన నంద్యాల ఉపఎన్నికలో కూడా వైసిపికి రూరల్ మండలాల్లోనే ఓట్లు బాగా వచ్చిన సంగతిని వైసిపి నేతలు గుర్తు చేస్తున్నారు. అందుకే జగన్ కూడా రూరల్ ఏరియాలెక్కువుండే నియోజకవర్గాలకే ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో పాదయాత్ర రూటు మ్యాప్ కూడా అదే విధంగా తయారుచేసారు.

కడప జిల్లాలోని 10 నియోజవకర్గాల్లో 7 నియోజకవర్గాలు, కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాలు, 10 నియోజకవర్గాల్లో పాదయాత్ర జరిగింది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని 14 నియోజవకర్గాల్లో కూడా జగన్ యాత్రలో రూరల్ నియోజవకర్గాలే ఉన్నాయి.

జిల్లాలోని గుత్తి, తాడిపత్రి, శింగనమల, ఉరవకొండ, అనంతపురం అర్బన్, రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాలపై జగన్ దృష్టి సారించారు. తాడిపత్రిలో జగన్ బహిరంగ సభకు ఎంతటి అనూహ్య స్పందన కనిపించిందో కదిరి నియోజవకర్గంలో జరిగిన బహిరంగసభ ఫినిషింగ్ టచ్ కూడా అంతే బ్రహ్మాండగా ఉంది.

సీఎం సొంత జిల్లా చిత్తూరులోకి ప్ర‌వేశిస్తుంది జ‌గ‌న్ పాద‌యాత్ర‌. చిత్తూరు జిల్లాలో కూడా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డితే అది టీడీపీకి పెద్ద దెబ్బే అని చెప్ప‌వ‌చ్చు. జిల్లా నాయ‌కులుకూడా పాద‌యాత్ర‌ను స‌క్సెస్ చేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. సో మొత్తం జ‌గ‌న్ పాద‌యాత్ర అంతా రూర‌ల్ ప్రాంతాల్లోనే జ‌రుగుతోంది. ఇది స‌క్సెస్ అయితే జ‌గ‌న్ విజ‌యాన్ని ఆప‌డం ఎవ‌రిత‌రం కాదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -