Sunday, May 19, 2024
- Advertisement -

జగన్ పెంపకం….. బాబుకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన విజయమ్మ

- Advertisement -

మూడు పెళ్ళిళ్ళు, ఫాం హౌస్ వ్యవహారాలు ఉన్నవాళ్ళ వ్యక్తిత్వం గురించి చర్చ చేయరు. ఇక ఫారెన్‌లో చదువులు అంటూ అమ్మాయిలతో అర్థనగ్న ఫొటోలు, మందు గ్లాసుల వ్యవహారాల గురించి చర్చించరు. ఇంకా అలాంటి ఫొటోలు చాలానే ఉన్నాయి స్వయానా సదరునేతే బహిరంగంగా స్టేట్‌మెంట్స్ ఇస్తాడు. ఇక కనిపిస్తే కడుపు చేసేయడమే అని మాట్లాడే వాళ్ళ వ్యక్తిత్వం గురించి కూడా చర్చించరు. కానీ వైఎస్ జగన్ వ్యక్తిత్వం గురించి మాత్రం చర్చోపచర్చలు చేస్తారు. వైఎస్ జగన్ స్మోకింగ్ చెయ్యడు, మద్యపానం అలవాటు లేదు అని టిడిపి భజన పత్రిక ఆంధ్రజ్యోతినే చెప్పింది. ఇక తనతో కలిసి నడిచేవాళ్ళను, నమ్ముకున్న వాళ్ళను, తన కంపెనీలలో ఉద్యోగం చేసే వాళ్ళను కోడి తన పిల్లలను చూసుకున్నంత బాగా చూసుకుంటాడని చెప్పింది. కాకపోతే అలాంటి మంచి విషయాలను కూడా ఏదో చాలా పెద్ద చెడ్డ విషయాలు అన్నట్టుగా విమర్శిస్తూ చెప్పారు.

ఇక అసెంబ్లీలో కూడా జగన్ పెంపకం గురించి చంద్రబాబు దిగజారుడు మాటలు మాట్లాడేశారు. ఈ రోజు అదే విషయంపై ప్రశ్నలు అడిగినప్పుడు విజయమ్మ సూటిగా సమాధానం చెప్పింది. చంద్రబాబు-వైఎస్‌ల పాలన, వ్యక్తిత్వాలను పోల్చి చెప్పమన్నప్పుడు కూడా విజయమ్మ స్పష్టంగా సమాధానం చెప్పింది. బాబుకు-వైఎస్‌కి అసలు పోలికే లేదని, వైఎస్ చనిపోయిన ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆయన చేసిన మంచిని ప్రజలు ఇంకా గుర్తుపెట్టుని ఉన్నారని చెప్పుకొచ్చింది విజయమ్మ. వైఎస్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, ఫీ రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ లాంటి పథకాల పేర్లు మార్చగలడేమో కానీ ఆ పథకాలను బాబు తీసేయలేడని చెప్పింది. వైఎస్ అంత దూరదృష్టితో భవిష్యత్తరాలకు కూడా ఉపయోగపడేలా సంక్షేమ పథకాలు అమలు చేశాడని చెప్పుకొచ్చింది.

ఇక జగన్ పెంపకం గురించి బాబు మాట్లాడిన మాటలపై స్పందించమని కోరగా……జగన్‌కి ఒక్క చెడు అలవాటైనా ఉందా? 24 గంటలూ ప్రజల మధ్యనే ఉండే జగన్ లక్షణం కనిపించడం లేదా? అని ప్రశ్నించింది విజయమ్మ. జగన్ పెంపకం గురించి మాట్లాడే వాళ్ళందరికీ దిమ్మతిరిగే సమాధానాలు చాలా స్పష్టంగా చెప్పుకొచ్చింది విజయమ్మ. జగన్ వ్యక్తిత్వంలో ఫలానా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఫలానా లోపాలు ఉన్నాయి అని నిరూపించమనండి అనే స్థాయిలో మాట్లాడింది విజయమ్మ.

జగన్‌ మంచి అలవాట్లను కూడా విమర్శించే ఆర్కే, చంద్రబాబు, లోకేష్‌లు ఇప్పుడు విజయమ్మకు సమాధానం చెప్పగలరా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -