Saturday, May 18, 2024
- Advertisement -

కత్తి వర్సెస్ పవన్……… పచ్చ బ్యాచ్‌కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన జగన్

- Advertisement -

మహేష్ కత్తి వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇష్యూ రోజు రోజుకూ తీవ్రమవుతూ ఉంది. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే అలా చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటి వరకూ ప్రధాన పార్టీల నాయకులు ఎవరూ స్పందించలేదు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో పాటు ప్రతిపక్ష నేత జగన్….అలాగే తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్‌తో సహా ఎవరూ స్పందించలేదు. అయితే ఈ ఇష్యూ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా తెరవెనుక ఉండి ఒక పార్టీ నడిపిస్తుందన్నది నిజం. మొదట్లో ఇది ఫేస్ బుక్‌లో ఉన్న కొంతమందికి మాత్రమే పరిమితం. అయితే ఆ ఇష్యూని రాజకీయంగా వాడుకుని జగన్‌ని కార్నర్ చెయ్యొచ్చని పచ్చ బ్యాచ్ వ్యూహం పన్నింది. మహేష్ కత్తిని జగన్ సపోర్ట్ చెయ్యకపోతే…….చూడూ……దళితుల ఓట్లు కొల్లగొడుతూ దళితుడికి సపోర్ట్ చెయ్యట్లేదు అని విమర్శించొచ్చు. ఒక వేళ సపోర్ట్ చేస్తే పవన్ ఫ్యాన్స్ ఓట్లతో పాటు కాపు ఓట్లను కొల్లగొట్టొచ్చు అన్నది పచ్చ వ్యూహం. అందుకే పచ్చ బ్యాచ్ భజన మీడియా ఛానల్స్ అన్నీ కూడా రెచ్చిపోయి మరీ మహేష్ కత్తికి సపోర్ట్ ఇస్తూ……..గంటలు గంటలు వాళ్ళ స్టూడియోలలో కూర్చోబెట్టి పవన్‌ని తిట్టించే కార్యక్రమం చేస్తున్నారు.

నిన్ని ఈ హడావిడి నడుస్తున్న టైంలోనే అత్యుత్సాహపరుడు అయిన ఒక పచ్చ బ్యాచ్ ఛానల్ మీడియా పర్సన్ కత్తి వర్సెస్ పవన్‌ ఇష్యూపై స్పందించమని పాదయాత్ర చేస్తున్న జగన్‌ని అడిగాడు. ఆ వెంటనే జగన్ అతనికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఒక రాష్ట్ర ప్రతిపక్షనేత పాదయాత్ర చేస్తుంటే పట్టుమని పది నిమిషాలు చూపించే తీరిక లేని మీడియా, ప్రజల సమస్యలపై కనీస స్థాయిలో స్పందించకుండా మహేష్ కత్తితో గంటలు గంటలు ఎందుకు లైవ్ ప్రోగ్రాం చేస్తున్నారు? ఆ ఛానల్స్‌ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాయో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆలోచన ఉన్న వాళ్ళందరికీ ఈ వ్యూహం, కుట్ర రాజకీయం చేస్తున్నారో తెలుసు అని స్పందించాడు. అలాగే వైకాపా పార్టీ నాయకులకు, అభిమానులందరికీ కూడా కత్తి వర్సెస్ పవన్ ఇష్యూపై అస్సలు స్పందించవద్దని ఆదేశాలు వెళ్ళాయి. అందుకే పచ్చ ఛానల్స్ అన్నీ కూడా ఈ విషయంపై స్పందించాలని రోజాతో సహా ఇతర వైకాపా నాయకులను అడుగుతుంటే అస్సలు స్పందించడం లేదు. జగన్ స్పందన గురించి తెలుసుకున్న రాజకీయ మేధావులు కూడా ఇప్పుడు జగన్‌ వ్యూహాత్మక నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.

దళితుడైన మహేష్ కత్తి చేత పవన్‌ని తిట్టించి……..మహేష్ కత్తి వెనుక జగన్ ఉన్నాడని సోషల్ మీడియాలో పచ్చ బ్యాచ్ చేత ప్రచారం చేయించి……..ఆ ప్రచారాన్ని పచ్చ మీడియా వరకూ తీసుకెళ్ళి కాపు-దళిత ఓట్ల విషయంలో రాజకీయం చేద్దామనుకున్న పవన్ వ్యూహాన్ని జగన్ భలేగా తిప్పికొట్టాడని వాళ్ళు అంటున్నారు. బాబుకు భజన చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా చంద్రబాబు కుట్ర రాజకీయాల గురించి తెలుసుకుంటే మంచిదని చెప్తున్నారు. పవన్ ఫ్యాన్స్‌ని, పవన్ ఓటర్లను పూర్తిగా జగన్‌కి వ్యతిరేకులుగా చేస్తే ఆ తర్వాత ఇక చంద్రబాబుకు సపోర్ట్ చేయడం తప్ప పవన్‌కి వేరే ఆఫ్షన్ ఉండదు. అలాంటి నేపథ్యంలో పవన్‌కి ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉండదు.

మొత్తానికి చంద్రబాబు రాజకీయ వ్యూహాన్ని జగన్ మాత్రం భలే తిప్పికొట్టాడన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పవన్ కూడా బాబు రాజకీయ కుట్రలను అర్థం చేసుకుని జాగ్రత్తపడితే బెటర్ అని వాళ్ళు పవన్‌కి సలహా ఇస్తున్నారు. పచ్చ మీడియాచేత బాబు ప్లే చేసిన రాజకీయ వ్యూహం అలా ఫెయిల్ అయింది మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -