Monday, May 6, 2024
- Advertisement -

క‌ష్టాల్లో టీమిండియా..ఆచి తూచి ఆడుతున్న కోహ్లీ, రోహిత్‌….

- Advertisement -

ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న మొద‌టి టెస్ట్‌లో టీమిండియా క‌ష్టాల్లో ప‌డింది. సఫారీలు నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన విరాట్‌ సేన.. 39 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయింది.

స్వదేశంలో శ్రీలంక సిరీస్‌లో వీరోచిత ఫామ్‌ కనబరిచిన ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (16; 20 బంతుల్లో 2×4) ఔటయ్యాడు. ఇన్నింగ్స్‌ 7.5వ బంతిని మోర్కెల్‌ షార్ట్‌పిచ్‌లో వేశాడు. తలపైకి వచ్చిన బంతిని ఆడబోయి గల్లీలో క్రిస్‌మోరిస్‌ చేతికి చిక్కాడు. ఇక రెండు సార్లు సమీక్ష కోరి బతికిపోయిన మురళీ విజయ్‌ (13; 32 బంతుల్లో 2×4) ఫిలాండర్‌ వేసిన 8.5వ బంతికి ఔటయ్యాడు. అంతకు ముందు ఫిలాండర్‌ వేసిన 2.2, 6.5 బంతులకే విజయ్‌ను అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. చివరికి అతడి బౌలింగ్‌లోనే ఏబీడీకి క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. చతేశ్వర పుజారా(4)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరడంతో టీమిండియా ఎదురీదుతోంది.

రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 130 పరుగుల స్వల్ప స్కోరు పరిమితమైంది. 65/2 ఓ‍వర్‌నైట్‌ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సఫారీలు.. మరో 65 పరుగులు జత చేసి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయారు. టీమిండియా పేస్‌ విభాగం విజృంభించి సఫారీల పనిపట్టింది. ఈ రోజు ఆటలో బూమ్రా, షమీలు తలో మూడు వికెట్లతో దక్షిణాఫ్రికా వెన్నువిరవగా, భువనేశ్వర్‌ కమార్‌ రెండు వికెట్లు సాధించి సత్తా చాటాడు. క్రీజ్‌లో (కోహ్లీ 22), రోహిత్ శ‌ర్మ (9) ఆచి తూచి ఆడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -