Thursday, April 25, 2024
- Advertisement -

అమిత్ షా, చంద్రబాబులకు జగన్ దిమ్మతిరిగే కౌంటర్స్…… సమాధానం ఉందా?

- Advertisement -

రాష్ట్రానికి అన్నీ చేశాం అన్నది అమిత్ షా డైలాగ్. ఏమీ చేయలేదు అన్నది చంద్రబాబు సమాధానం. హోదా వద్దని చెప్పి చంద్రబాబే చెప్పాడు. ప్యాకేజ్ చాలాని చెప్పి బాబు చెప్తేనే ప్యాకేజ్ ప్రకటించాం అని అమిత్ షా చెప్తున్నాడు. కానీ చంద్రబాబేమో బిజెపి వాళ్ళవి నాటకాలు….. వాళ్ళు రాష్ట్రాన్ని హేళన చేస్తున్నారు అని టాపిక్ డైవర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై జగన్ తాజాగా స్పందిస్తాడు.

బిజెపి, టిడిపిలు రెండూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో డ్రామాలు ఆడుతున్నారని చెప్పుకొచ్చాడు. హోదా వద్దని అనడానికి చంద్రబాబు ఎవరు? అలాగే బాబు వద్దన్నాడని చెప్పి హోదా ఇవ్వకుండా బిజెపి ఎలా ఉంటుంది? అమిత్ షా-చంద్రబాబులు కలిసి ఆడుతున్న డ్రామాలేంటి? బిజెపి ఏమీ ఇవ్వలేదు అని ఇప్పుడు చెప్తున్న చంద్రబాబు…… కేవలం కొన్ని నెలల క్రితమే బిజెపి అన్నీ ఇచ్చింది అని చెప్పి…..అద్భుతంగా సాయం చేస్తోంది అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఎందుకు తీర్మానం చేసి మోడీని ఎందుకు అభినందించాడు? వెంకయ్య, అరుణ్ జైట్లీలకు ఎందుకు సన్మానం చేశాడు?

ఆంధ్రప్రదేశ్ విషయంలో నాలుగేళ్ళుగా బిజెపి, టిడిపిలు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. హోదా అవసరం లేదు…. ప్యాకేజ్ చాలు అని బాబు చెప్తే మాత్రం మోడీ ఎలా ఒప్పుకుంటడా? రాష్ట్రం ఎవడబ్బ సొత్తని? ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షను బిజెపి కచ్చితంగా నెరవేర్చాల్సిందే. అలాగే ప్రత్యేక హోదా విషయంలో గడియకో మాట మాట్లాడుతూ నాటకాలు ఆడుతున్న చంద్రబాబుని ప్రజలే ఓటుతో శిక్షిస్తారని జగన్ చెప్పుకొచ్చాడు. అమిత్ షా, చంద్రబాబులకు జగన్ సంధించిన సూటి ప్రశ్నలపై ఇప్పటి వరకూ రెండు పార్టీల నుంచి కానీ….ఆయా పార్టీల నాయకుల నుంచి కానీ సమాధానం రాలేదు? బిజెపి, టిడిపిల రాజకీయ నాటకాలు ఇక్కడే తెలిసిపోతున్నాయని ప్రత్యేక హోదా ఉద్యమకారులు బాబు, అమిత్ షాలను విమర్శిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -