Thursday, May 16, 2024
- Advertisement -

టీడీపీ కొత్త దెబ్బ.. వైసీపీలోకి ఎమ్మెల్యే..?

- Advertisement -

ఏపీలో పదవుల కోసం దాదాపు ఇరవై ఒక్క ఒక్క మంది ఎమ్మెల్యేలు ,ఇద్దరు ఎంపీలు అధికార పార్టీ టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లాలో గిద్దలూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి త్వరలోనే సొంత గూటికి రానున్నారు అని వార్తలు తెగ హాల్ చల్ చేస్తోన్నాయి. అశోక్ రెడ్డిని నారా లోకేష్ నాయుడు ఇటీవల చెడామడా తిట్టేశాడట.

అంతే కాదు ఏకంగా ఒక మంత్రి స్థానంలో ఉండి ముఖ్యమంత్రి తనయుడ్ని అనే అహంకారంతో లోకేష్ తనదైన శైలిలో తీవ్రమైన పదజాలంతో అశోక్ రెడ్డిపై విరుచుకుపడ్డట్టు సమాచారం. టీడీపీలో తనను అవమానించారని అంటూ.. అన్నా రాంబాబు టీడీపీ కండువాను నేలకేసి కొట్టి రాజీనామా విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. బాబుతో కానీ, లోకేష్ తో కానీ ఎలాంటి సంప్రదింపులు లేకుండా రాంబాబు రాజీనామా చేశాడు. ఈ క్రమంలో.. పార్టీ నుంచి ఆ మాజీ ఎమ్మెల్యే అలా జారిపోవడంపై లోకేష్ కు కోపం వచ్చిందట. రాంబాబు అలా వెళ్లిపోవడానికి కారణం అశోక్ రెడ్డే అనే లోకేష్ తీవ్ర పదజాలంతో దుషించాడట. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన వైసీపీలో ఉన్న గౌరవం టీడీపీలో లేదని ..లోకేష్ దగ్గర నుండి టీడీపీ నేతలందరూ అధికార మదంతో పార్టీ ఫిరాయించిన మాలాంటి నేతలను పలు అవమానాలకు గురిచేస్తోన్నారు.

గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ హయంలో పెరిగిన అవినీతి ,అరాచక పాలన నచ్చక అన్నా రాంబాబు పార్టీ మారితే నా తప్పు ఎలా అవుతుంది .పార్టీనే సక్కగా లేనప్పుడు నేతలు ఎలా ఉంటారు అని అశోక్ రెడ్డి తెగ బాధపడ్డాడట. ఈ నెపథ్యంలో జగన్ ప్రకాశం జిల్లాకి వచ్చిన సమయంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి వైసీపీ గూటికి రావడానికి ముహూర్తం ఖరారు చేయాలనీ తన అనుచరవర్గాన్ని ,స్థానిక వైసీపీ నేతలను కోరినట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -