Sunday, May 12, 2024
- Advertisement -

వింటున్నారా బాబు గారు… హోదా కోసం అత్యున్నత పోరాటం ఏంటో చెప్పిన జగన్

- Advertisement -

కొత్త సేద్యగాడు పొద్దెరగడు అన్నట్టు నాలుగేళ్ళుగా హోదా కోసం పోరాటం చేస్తున్న జగన్ తనను ఫాలో అవ్వాలని చంద్రబాబు కోరుకుంటున్నాడు. అలా అని కొత్త పోరాట పంథా ఏదైనా చంద్రబాబు చెప్తున్నాడా అంటే అది కూడా లేదు. హోదా వద్దు ప్యాకేజ్ ముద్దు అని నాలుగేళ్ళు కాలక్షేపం చేసినట్టుగానే అవిశ్వాసం వేస్ట్ అని జగన్‌ని ఎద్దేవా చేశాడు. ఆ తర్వాత ఆ అవిశ్వాసం ఐడియా తనదే అన్నంత బిల్డప్ ఇస్తున్నాడు. ఇప్పుడిక ఎంపిల రాజీనామాల విషయంలో కూడా చంద్రబాబు యూటర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రెండేళ్ళ క్రితం నాడే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయమని జగన్ చెప్తే చంద్రబాబు ఎటకారం చేశాడు. కాలయాపన లేకుండా తొందరపడాల్సిన ఈ టైంలో మాత్రం అఖిల పక్షం పేరు చెప్పి చంద్రబాబు కాలయాపన డ్రామాలు చేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన….కాస్త ఆశాజనకంగా కనిపిస్తున్న ఆలోచనను చెప్పాడు జగన్. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపిలు అందరూ రాజీనామా చేసి……..మొత్తం ఇరవై ఐదు మంది ఎంపిలు కలిసి ఢిల్లీలోనే నిరాహారదీక్షకు కూర్చుంటే ప్రత్యేక హోదా విషయంలో మోడీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం ఉండదని…..కచ్చితంగా హోదా ఇవ్వాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతుంది అన్నది జగన్ చెప్పిన వ్యూహం. ఈ విషయంలో టిడిపి కలిసిరాకపోయినా వైకాపా ఎంపిలు మాత్రం రాజీనామాలు చేసి ఢిల్లీలోనే నిరాహారదీక్షకు కూర్చుంటారని జగన్ ప్రకటించాడు.

అయితే రాజకీయ చర్చల్లో పాల్గొంటున్న విశ్లేషకులు మాత్రం జగన్ ఆలోచన చాలా బాగుందని……ఇప్పటికే హోదాతో పాటు అవిశ్వాసం విషయంలో కూడా పూర్తిగా జగన్‌ వ్యూహాలను అనుసరిస్తున్న చంద్రబాబు……ఈ ఒక్క విషయంలో కూడా జగన్‌తో కలిసి నడిస్తే ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం 25మంది ఎంపిలు రాజీనామా చేసి ఢిల్లీ వేదికగా మోడీ ప్రభుత్వాన్నికి వ్యతిరేకంగా నిరాహారదీక్షకు కూర్చోవడమంటే మామూలు విషయం కాదని…….కచ్చితంగా దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ……ప్రతి మీడియా సంస్థ కూడా ఎంపిల నిరాహారదీక్షను హైలైట్ చేస్తాయని…….దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా మోడీ చేసిన మోసం తెలిసే అవకాశం ఉంది కాబట్టి మోడీ కచ్చితంగా సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుందని మేధావులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసమే అన్నపానాదులు కూడా తీసుకుంటున్నానన్నట్టుగా చంద్రబాబు ఎపి ప్రయోజనాల కోసం జగన్‌తో కలిసి నడుస్తాడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -