Sunday, May 5, 2024
- Advertisement -

ప్రతిపక్షం పోరాటం చేయాలి బాబూ……. ఇదేంటి రివర్స్‌లో……. అధికార పార్టీ డ్రామా

- Advertisement -

నాకంటే అనుభవజ్ఙడు లేడు అని నిత్యం చెప్పుకుంటూ ఉంటాడు…ఆ అనుభవం మాత్రం ఒన్ పర్సెంట్ కూడా ఆంద్రప్రదేశ్‌కి ఉపయోగపడడం లేదు. ఎల్లో మీడియా, పవన్ కళ్యాణ్, మోడీ మేనియా పుణ్యమాని ….సీమాంధ్ర ప్రజల చెవుల్లో ప్రచార పూలు పెడుతూ అబద్ధపు హామీలతో హోరెత్తించిన పుణ్యమాని అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు. పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన అనుభవం మొత్తం ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడని అందరూ ఆశించారు. అయితే చంద్రబాబు మాత్రం తనను అధికారంలోకి తీసుకొచ్చిన ప్రచార గిమ్మిక్కులు, డ్రామాలతోనే బండి లాగిస్తున్నాడు. తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా చంద్రబాబుది అదే స్ట్రాటజీ.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడండి, విభజన హామీల కోసం పోరాడండి, ప్యాకేజీకి చట్టబద్ధత తీసుకురావడం కోసం ఒత్తిడి చేయండి……’ ఇంకా ఇలాంటి మాటలు పార్టీ అధినేత తన పార్టీ ఎంపిలకు చెప్పాడంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నట్టా? ప్రతిపక్షంలో ఉన్నట్టా. మామూలుగా అయితే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఇలాంటి మాటలు చెప్తారు. కానీ చంద్రబాబు జమానాలో అది రివర్స్. ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం పార్లమెంట్‌లో పోరాడమని చెప్పి తన ఎంపిలకు చెప్పాడు. ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే అధికారంలో ఉన్న చంద్రబాబు….. మోడీతో కలిసి అధికారాన్ని పంచుకుంటున్న చంద్రబాబు, కేంద్రంలో తన పార్టీ కేబినెట్ మంత్రులు, మంత్రులు ఉన్న చంద్రబాబు కూడా పోరాటం చేయమన్న మాటలే చెప్తూ రాజకీయా డ్రామాలు ప్లే చేస్తున్నాడు. మోడీతో చంద్రబాబు ఎందుకు అధికారం పంచుకుంటున్నాడు? ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమా? కేసుల నుంచి భయటపడడానికి, అవినీతి విషయంలో కేంద్రం చూసీ చూడనట్టుగా పోవడానికి, వ్యక్తిగత ప్రయోజనాల కోసమా? ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాల కోసమే అయితే కేంద్రం నుంచీ అలాంటివేమీ అందడం లేదని చంద్రబాబు మాటల్లోనే విస్పష్టంగా తెలుస్తోంది. ఓటుకు నోటు పుణ్యమా అని హోదాకు కేంద్రం మంగళం పాడేలా చంద్రబాబే చేశాడు. కనీసం ప్యాేకజీకి చట్టబద్ధత కూడా లేదు. రైల్వే జోన్‌కి దిక్కులేదు. పోలవరం, రాజధాని నిధుల వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది అని చంద్రబాబే వాపోతూ ఉంటాడు. అంటే కేంద్రం నుంచీ రాష్ట్రానికి ఏ ప్రయోజనాలూ అందడం లేదు. ఇక చంద్రబాబు కేంద్రంలో భాగస్వామిగా ఎందుకున్నట్టు? ఓటుకు నోటుతో సహా ఎన్ని వ్యవహారాలు ఉన్నట్టు?

ఇక ఇప్పుడు టిడిపి ఎంపిలు ఎవరిపైన పోరాటం చేయాలి? టిడిపి, బిజెపి కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వంపైననా? టిడిపి కేంద్రమంత్రులపైననా? అంటే టిడిపి ప్రభుత్వంపైన టిడిపి ఎంపీలు పోరాటం చేయాలా? ఇంతకుమించిన కామెడీ ఏం ఉంటుంది? అయినా చంద్రబాబే మోడీ దగ్గర సాగిలపడిన తర్వాత టిడిపి ఎంపిలు చేసే పోరాటం ఏం ఉంటుంది? అందుకే ఆ మధ్య జేసీ దివాకర్‌రెడ్డి ఓపెన్‌గా మాట్లాడేశాడు. ‘పోరాటమా……వంకాయా…..బాబు మళ్ళీ మాకు ఆ అవకాశం కూడా ఇస్తాడా…..బాబే సాగిలపడ్డాక మేం చేసేది ఏముంది? ఢిల్లీలో మాకు కనీస స్థాయిలో కూడా విలువ లేదు’ అని చెప్పాడు జేసీ. నాలుగేళ్ళ కాలంలో పరిస్థితి ఇది. అయినప్పటికీ బాబు మాత్రం తన ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసే ఉంటూ సీమాంధ్ర ప్రజలను వెర్రోళ్ళను చేయడానికి మాత్రం ఇలాంటి పోరాటం మాటల డ్రామాలు ఆడుతూ ఉంటాడు.

ఇదే సందర్భంలో జగన్ ఎంపిలు ఎందుకు రాజీనామా చేయడం లేదని కూడా టిడిపి నాయకులు సిగ్గులేకుండా అడుగుతూ ఉంటారు. వైకాపా ఎంపిలు రాజీనామా చేస్తే …..ఆ తర్వాత ఇక హోదా గురించి, విభజన హామీల గురించి మాట్లాడేవారు ఎవరు ఉంటారో టిడిపి నాయకులు చెప్పగలరా? అయినా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్ధతిచ్చినందుకు జగన్‌ని విమర్శిస్తున్న బాబు……..అన్ని విషయాల్లోనూ బిజెపికి మద్దతిస్తూ…..వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వామిగా ఎందుకున్నట్టు? జగన్ చేసింది తప్పయితే అధికారంలో ఉన్న చంద్రబాబు చేసింది ఇంకెంత పెద్ద తప్పు కావాలి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -