Thursday, May 9, 2024
- Advertisement -

బాలిక అని కూడా చూడకుండా 29 రోజులు నరకం చూపించారు

- Advertisement -

హాలీవుడ్ హర్రర్‌, సైకోటిక్‌ మూవీని తలపించేలా.. ఓ సంఘటన జరిగింది. అది కూడా ఓ 15 ఏళ్ల బాలికకు ఎదురైన అనుభవం. జీవితంలో మర్చిపోలేని దుర్ఘటన. ఆ బాలికకు.. ఏకంగా 29 రోజులు నరకం చూపించారు. మంచితనంతో ఇంటికివచ్చిన ఓ వ్యక్తి.. ఆ బాలికను తీసుకెళ్లి.. మృగం కంటే దారుణంగా ప్రవర్తించాడు. అలెగ్జాండ్రియాకు చెందిన ఓ బాలిక(15)ను ఎత్తుకెళ్లి థామస్‌ బార్కర్‌ అనే వ్యక్తి దాదాపు నెల రోజుల పాటు పాశవిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో ఇద్దరు కూడా ఈ దుర్మార్గపు చర్యలో పాలుపంచుకున్నారు.

ఆగస్టు 8న రాత్రి 10.30 గంటలకు థామస్‌ బార్కర్‌.. అలెగ్జాండ్రియాలోని బాలిక ఇంటికి వచ్చాడు. ఆమె ఫ్యామిలీకి ఏం చెప్పకుండా.. ఆ అమ్మాయిని అక్కడ నుంచి తీసుకెళ్లాడు. ఆ బాలిక చూడకుండా ఇంట్లో ఉన్న మొబైల్‌ ఫోన్‌ తీసి బయటికి విసిరి పారేశాడు. అతడు తమ ఫ్యామిలికి తెలిసిన వ్యక్తి కావడం వల్ల.. ఆ బాలిక పిలవగానే అతడిని నమ్మి వెంట వెళ్లింది. ఇంట్లో కూడా చెప్పకుండా బాలిక అతడి ఇంటికి వెళ్లింది. ఆ బాలికను థామస్‌ ఓ మొబైల్‌ హౌస్‌లోకి తీసుకెళ్లాడు.

వెంటనే తుపాకితో బెదిరించి.. బెడ్‌ రూంలో కట్టి పడేశాడు. ఆ తర్వాత ప్రతి రోజు లైంగిక దాడికి పాల్పడటం మొదలుపెట్టాడు. ఈ దురాగతంలో జోష్‌వా హల్బీ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. చెప్పకూడని విధంగా ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడుతూ కేవలం ఒక్కపూట మాత్రమే భోజనంపెడుతూ రాక్షసులకంటే దారుణంగా ప్రవర్తించారు. ఆ బాలికను రెండు మూడు సార్లు హత్య చేయడానికి కూడా ప్రయత్నించారు. టబ్లో ముంచి ఊపిరి అగిపోయేలా చేయడం.. మెడకు ఉరి పెట్టి ఓ బకెట్‌పై నిలబెట్టి దానిని తన్నేసి ఆనందించడం వంటి చేశారు. ఇక సూదులతో గుచ్చడంలాంటివైతే లెక్కలేదు. అంత దారుణ పరిస్థితుల మధ్య నుంచి కూడా ఆ బాలిక ఎన్నోసార్లు అక్కడ్నించి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఆ బాలిక కనిపించకపోవడంతో ఆమె ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు థామస్‌ ఇంటి వద్ద పరిశిలించక ముందే.. థామస్‌, అతడి బృందం.. ఆ బాలికను అక్కడి నుంచి తప్పించాడు. తినడానికి థామస్‌ బయటకు వెళ్లిన సమయంలో ఆ బాలిక ఎంతో సాహసం చేసి తప్పించుకోగలిగింది. అయితే ఆమె ఉన్న చోట పెద్ద చెరువు ఉంది. దీంతో ఏ మాత్రం ఆలోచించకుండా అందులో దూకి ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకుంది. అయితే బాలిక కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోస్టర్లు వేశారు. చెరువు నుండి ఈదుకుంటు వచ్చిన ఆ బాలికను అక్కడ ఉన్న ఓ రైతు గుర్తుపట్టాడు. వెంటనే ఆ బాలికకు దుస్తులు ఇచ్చి.. తన వాహనంలో కుర్చోబెట్టి.. పోలీసులకు ఫోన్‌ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. దాంతో అత్యాచారానికి ఒడిగట్టిన వారిని అరెస్టు చేసి.. ఆ బాలికను కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -