Friday, April 26, 2024
- Advertisement -

సరైనోడు వచ్చాడు.. తెరవెనక జగన్ ప్లాన్ ఇదే

- Advertisement -

వైసీపీలో చొరబడిన నంద్యాల‌,కాకినాడ భయం ఇప్పట్లో బయటకు పోయేలా కనిపించడం లేదు. మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు అలాగే ఉండేలా కనిపిస్తోంది. అయితే ప్రధానంగా గుంటూరు జిల్లాలో రెండు, మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థులు లేని ప‌రిస్థితి వైసీపీలో ఏర్పడింది. అంతేకాకుండా.. గుంటూరు పార్ల‌మెంట్ స్థానం ఎవరు బరిలో ఉంటారో అనేది అధిష్టానానికి అర్ధం కావడం లేదట.

గత ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయిన బాల‌శౌరి.. వచ్చే ఎన్నికలకి దూరంగా ఉంటున్నాడట. ఈ నెపథ్యంలో ఎవరిని దింపాలని వైసీపీఆలోచ‌న‌లో ప‌డింది. ఇంతలోనే వార‌సుడు, స‌రైనోడు వచ్చాడంటూ.. వైసీపీ నేత‌లు సంబ‌రాలు చేసుకుంటున్నారు. మరి ఇంతకి ఎవరు అతను అంటే.. విజ్ఞాన్ విద్యాసంస్థ‌ల అధినేత లావు ర‌త్త‌య్య గ‌త ఎన్నిక‌ల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.కానీ అప్ప‌టి ప‌రిస్థితుల రీత్యా ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌లేదు.పోటీ చేసేందుకు అవ‌కాశం రాలేదు.కానీ ఈసారి మాత్రం ర‌త్త‌య్య కోరిక నెర‌వేర‌బోతుంద‌ట‌. కాక‌పోతే పోటీచేసేది ఆయ‌న కాద‌ట‌. ఆయ‌న వార‌సుడు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లుని దింపుతున్నాడ‌ట‌. గుంటూరు ఎంపీ సీటుకు పోటీకి దిగిందుకు.. అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ట. అందుకే ఎన్న‌డూ లేనంత‌గా లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గ‌మంత‌టా శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు తెగ చుట్టేస్తున్నాడు. ఇక‌పై గుంటూరు మ‌న‌దే,టెన్ష‌న్ వ‌ద్దు. నేనున్నా, నేనే పోటీచేస్తా.. టీడీపీని ఓడిస్తా అంటూ వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా ఇస్తున్నాడ‌ట. అయితే అక్కడ బాల‌శౌరి నిజంగానే పోటీకి దూరంగా ఉంటాడా లేదా అనేది కొంద‌రిలో ఉన్న అనుమానం. అది క్లియర్ అవుతే.. ఉత్సాహం వైసీపీలో నిండుకుంట‌ద‌ని అంటున్నారు జిల్లా నేత‌లు. ర‌త్త‌య్య వార‌సుడి గెలుపు కోసం వైసీపీ మంచి సపోర్ట్ చేస్తుందని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే జగన్ తెర‌వెన‌క శ్రీకృష్ణ‌దేవ‌రాయులుతో మంత్రాంగం న‌డిపి ముందుకు న‌డిపిస్తున్నాడ‌ని.. అందుకే గుంటూర్ విషయంలో ఆయన పెద్దగా టెన్ష‌న్ ప‌డ‌టం లేద‌ని.. గుంటూర్ లో గెలుపు ఖాయం అని జగన్ ధీమాగా ఉన్నారని నేతలు అంటున్నారు. మరి వైసీపీ అధికారికంగా ప్రకటించే వరకు అసలు నిజాలు బయటకు రావు. నిజంగానే శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లుకు ఎంపీ టికెట్ ఖాయ‌మ‌ని జ‌గ‌న్ హామీ ఇస్తే మాత్రం ఆయనను గెలిపించడంకోసం కృషి చేస్తామ‌ని వైసీపీ నేత‌లుఅంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -