Sunday, May 5, 2024
- Advertisement -

ఇద్ద‌రి మ‌ధ్య న‌లిగిపోతున్న బాబు….

- Advertisement -

చంద్ర‌బాబు నాయుడికి విశాఖ నేత‌ల లొల్లి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బాబు మంత్రి వ‌ర్గంలో ఉన్న ఇద్ద‌రు మంత్రుల న‌తేల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డివేస్తె బ‌గ్గుమంటోంది. ఇద్ద‌రి పంచాయితీని తీర్చ‌లేక బాబుకి త‌ల బొప్పి క‌ట్టింది. ఇద్ద‌రి మంత్రులు వ్య‌వ‌హారం చిలికి చిలికి గాలివానలా మారుతోంది.

ఆ ఇద్ద‌రే విశాఖ‌కు చెందిన అయ్య‌న్న పాత్రుడు, గంటా శ్రీనివాస‌రావులు. అయ్య‌న్న సుదీర్ఘ‌కాలంగా టీడీపీలోనే ఉన్నారు. గంటా మాత్రం ప్ర‌జారాజ్యం, కాంగ్రెస్ అటూ అనుకూలంగా ఉన్న పార్టీల‌పై జంప్ చేస్తూ.. టీడీపీలో కొన‌సాగుతున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య ఆధిప‌త్య ధోర‌ణితోపాటు.. వ్య‌క్తిగ‌త ఎదుగుద‌ల‌పైనా ఒకింత ద్వేషం ఉంది.

వీరిద్ద‌రి మధ్య విశాఖ భూముల వ్య‌వ‌హారం మ‌రింత‌గా చిచ్చు పెట్టింది. విశాఖలో భూ కుంభకోణం జ‌రిగింద‌ని, దీనిలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల పాత్రే ఉందని మంత్రి అయ్యన్న పరోక్షంగా మంత్రి గంటాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలీలో వందల ఎకరాలు కబ్జాకు గురయ్యాయని ఆధారాల‌తో స‌హా మీడియాకు చెప్పారు. దీంతో మంత్రి గంటా చిక్కుల్లో ప‌డిపోయారు. అయ్య‌న్న‌ను నేరుగా విమ‌ర్శించ‌కుండా గంటా బాబుకి ఘాటుగా లేఖ‌రాశారు.

విశాఖ భూకుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరారు. ఇద్ద‌రికి ఎవ‌రికి చెప్పాలో అర్థంకాక సిట్‌ను వేశారు. సిట్ కు మంత్రి అయ్యన్న పెద్ద జాబితానే ఇచ్చి వచ్చారు. ఇదిలా ఉంటె ఇప్పుడు తాజాగా విశాఖ‌లో విచ్చ‌ల‌విడిగా ల‌భించే గంజాయి కూడా ఇద్ద‌రి మ‌ధ్య పోరు పెంచింది. గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు, గంజాయి పెంపకాన్ని నిషేధించడంపై మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

దీనిపైన కూడా మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు మంత్రి గంటాపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. గంజాయి నియంత్రణకు సమీక్షలు చేయాల్సిన అవసరంలేద‌ని …గంజాయి మాఫియా ఎవరో, గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న వారికి ఎవరి అండదండలున్నాయో తెలుసునని బాంబు పేల్చారు. గంజాయి స్థావరాలు ఎక్కడున్నాయో అందరికీ తెలుసునని, వారిపై పీడీయాక్టు ప్రయోగించాలని అయ్యన్న అన్నారు. ఇలా ఇద్ద‌రి కీల‌క నేత‌ల మ‌ధ్య ఉన్న విబేధాలు బాబుకు నిద్ర‌లేకుండా చేస్తున్నాయి. ఎవ‌రికి చెప్పాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -