ప్రధాని మోడీ దేశంలో నల్ల ధనం బయటకు తీయడానికి రూ.500 – రూ.1000 నోట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ రూ.500 – రూ.1000 నోట్ల ప్లేస్ లో కొత్త 500, .2 వేల నోట్లను ప్రవేశపెట్టారు. అయితే ఓ రూ.2 వేల నోట్లపై జనంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
కొత్త రూ.2 వేల నోట్లు మనకు లభిస్తున్నా దానికి సరిపడా చిల్లర మాత్రం దొరకడం లేదు. ఇదిలా ఉంటే ఇప్పటికే నోట్ల రద్దు విషయంలో షాక్‌ల మీద షాక్‌లు ఎదుర్కొంటున్న ప్రజలకు మరో షాక్ న్యూస్ త్వరలోనే రానుందట. అదే రూ.2 వేల నోటు రద్దు. రూ.2 వేల నోటు తాత్కాలికంగా ప్రవేశపెట్టిందేనని… నోట్ల రద్దు తరువాత వ్యవస్థ మొత్తం చక్కబడిన తరువాత… దాన్నీ రద్దు చేస్తారన్న మ్యాటర్ రిజర్వ్ బ్యాంక్ వర్గాల ద్వారా లీక్ అయినట్టు తెలుస్తోంది.
500 – 1000 నోట్ల రద్దుతో తగ్గిన క్యాష్ ఫ్లోను కవర్ చేయడానికి మాత్రంమే ఈ నోటును ప్రవేశపెట్టినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలోకి కొత్త 500 – 1000 నోట్లు పూర్తిగా వచ్చి చేరాక రూ.2వేల నోట్లను వెనక్కు తీసుకుంటారని మ్యాటర్ లీక్ అయ్యింది. అదే జరిగితే ఈ సారి ఆర్థిక వ్యవస్థలో మరో కుదుపు తప్పదేమో. మళ్లీ బడాబాబులకు మరో షాక్ తప్పదేమో.
Related