Thursday, May 16, 2024
- Advertisement -

యాంకర్ ప్రదీప్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

- Advertisement -

రేడియో జాకీ గా రేడియో మిర్చి ఇది చాలా హాట్ గురూ అంటూ మొదలు పెట్టి..  ఉత్తమ యాంకర్ గా 2010 సంవత్సరంలో నంది అవార్డును అందుకున్నాడు యాంకర్ ప్రదీప్. ప్రదీప్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత రేడియో జాకీగా చేసి.. తరువాత బుల్లితెరకి పరిచయమయ్యాడు. తరువాత ప్రదీప్ దర్బర్ అనే షోతో తన సత్తా చాటుకున్నాడు.

జీ తెలుగులో వచ్చే గడసరి అత్త సొగసరి కోడలు అనే ప్రోగ్రామ్ తో ఒక్కసారిగా బాగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ షోతో ప్రదీప్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. దాంతో తన రెమ్యూనరేషన్ కూడా పెంచేసాడు. జీ తెలుగులోనే వచ్చే కొంచం టచ్లో ఉంటే చెప్తా అనే ప్రోగ్రామ్ తో సెలెబ్రెటీలనిఇంటర్వ్యూ చేసి, వారి వ్యక్తిగత,సినిమా జీవితాల గురించి ప్రేక్షకులకి తెలియజేశాడు. ఈ షోకి మంచి క్రేజ్ రావడంతో ఆ ఛానల్ రేటు కూడా పెరిగింది.

ఇవే కాక ఈ-టీవిలో వచ్చే నర్తనశాల,అదుర్స్, ఈ-ప్లస్ లో వచ్చే కిరాక్ షో, లక్ష్మి దేవి తలుపు తట్టింది వంటి పలు షోలు చేస్తున్నాడు ప్రదీప్. అప్పుడు అప్పుడు సినిమాల్లో కూడా ప్రదీప్ నటిస్తున్నాడు. మాటలతో ప్రేక్షకులని, కిక్కెక్కించే ప్రదీప్ అంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వుంది. అయితే ఇన్ని షోలతో బిజీగా వున్న ప్రదీప్ తన తొలి సంపాదన రూ.25,000 వేలతో ఈవెంట్ ఆర్గనైజర్ గా మొదలెట్టాడు. ప్రస్తుతం తన సంపాదన నెలకి 20లక్షలు వస్తుంది. రేడియో జాకీగా 20వేలు తీసుకున్న ప్రదీప్… బుల్లితెర పై తొలి షోకి రూ.15,000 తీసుకున్నాడు. ప్రస్తుతం ఒక్కో ఎపిసోడ్ కి రూ.50,000 తీసుకుంటాడు. కొంచం టచ్లో ఉంటే చెప్తా ప్రోగ్రామ్ కి లక్ష తీసుకుంటున్నాడు. ఇవే కాకుండా ఆడియో ఫంక్షన్లో కూడా తన హవా కొనసాగిస్తున్నాడు.

Related

  1. యాంకర్ రవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
  2. వ్యభిచారం అడ్డంగా పట్టుబడ్డ మరో హాట్ యాంకర్!
  3. స్టార్ డైరెక్టర్ తో రాత్రంతా గడిపిన హాట్ యాంకర్!
  4. అడల్ట్ సినిమాలో యాంకర్ శ్రీముఖి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -