Tuesday, May 21, 2024
- Advertisement -

శాత‌క‌ర్ణి టీజ‌ర్ చూసిన ఎన్టీఆర్ ఫిదా..!

- Advertisement -

టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీకి ఏ రెంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. నంద‌మూరి బాల‌కృష్ణ‌ ప్రస్తుతం చేస్తున్న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాపై మంచి క్రేజ్ ఉంది. అయితే బాల‌కృష్ణ‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న గ్యాప్ గురించి అంద‌రికి తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచే బాబాయ్ బాల‌య్య‌, అబ్బాయ్ మ‌ధ్య ఉన్న గ్యాప్ రోజు రోజుకు పెద్ద‌ద‌వుతూ వ‌స్తోంది.

బాబాయ్‌, అబ్బాయ్ మ‌ధ్య స‌రైన మాట‌లు లేవు. అయితే ద‌సరా సందర్భంగా శాత‌క‌ర్ణి టీజ‌ర్ రిలీజ్ అయ్యి మంచి స్పందన తెచ్చుకుంది. ఈ టీజర్ కు ప‌లువురు ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీల ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఇక యూట్యూబ్‌లో కూడా ఈ టీజర్ కు మంచి వ్యూస్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే శాత‌క‌ర్ణి టీజ‌ర్ చూసిన ఎన్టీఆర్ ఫిదా అయిపోయాడ‌ట‌.

ఇలాంటి పాత్ర‌లు చేయాలంటే కేవ‌లం బాబాయ్ వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంద‌ని… ఈ సినిమా కోసం తాను ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నాన‌ని త‌న స‌న్నిహితుల‌తో అన్నాడ‌ట‌. శాత‌క‌ర్ణి టీజ‌ర్‌ను ఎన్టీఆర్ మెచ్చుకున్న‌ట్టు వార్త‌లు రావ‌డం హాట్ టాపిక్‌గా మారింది. మరి ఇదే సంగతిని ఎన్టీఆర్ ఓపెన్‌గా చెపితే బాగుండేది అంటున్నారు. ఇక గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Related

  1. ఎన్టీఆర్ కొత్త సినిమా దర్శకుడు ఇతనే!
  2. ఎన్టీఆర్ మళ్లీ ఎందుకు లావు అయ్యాడో తెలుసా?
  3. exclusive: కె.రాఘవేంద్రరావు తో ఎన్టీఆర్ సినిమా!
  4. నారా రోహిత్ ని తెగ పోగిడేసిన బాలయ్య

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -