Sunday, May 5, 2024
- Advertisement -

2018లో రాబోతున్న iPhone మోడళ్లు ఇవే

- Advertisement -

ప్ర‌పంచంలో యాపిల్ ఐఫోన్‌ల‌కు ఉన్నంత క్రేజ్ ఏదానిక‌లేదు. మొబైల్ ప్రియులు ఎక్క‌వ‌గా వాటినె ఇష్ట‌డ‌తారు. యాపిల్ సంస్థ‌నుంచి మార్కెట్‌లోకి కొత్త మోడ‌ళ్లు ఏవి వ‌చ్చినా అన్నీ క్ష‌ణాల్లో హాట్ కేకుల్లా అమ్మ‌డుపోతున్నాయి. ఎంత రేటు పెట్టైనా కొనేందుకు మొబైల్ ప్రియులు వెనుకాడ‌టంలేదు.

Apple iPhone విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా Apple ఎలాంటి phoneలు తీసుకు వస్తుందో అని దాదాపు ఏడాది కాలం నుండి చాలా ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. మొత్తానికి iPhone 8, 8 Plus, iPhone X మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ మోడ‌ల్లు హాట్ కేకుల్లా అమ్ముడ పోయాయి. ఇప్పుడు మొబైల్ ప్రియులు 2018 లో ఎలాంటి మోడ‌ళ్లు వ‌స్తాయోన‌ని అందరూ చూస్తున్నారు.

ప్రాధమికంగా అందిన సమాచారం ప్రకారం 2018లో Apple సంస్థ మూడు iPhone మోడళ్లని విడుదల చెయ్యబోతోంది. వీటిలో రెండు OLED displayలతో రాబోతున్నాయి. మూడవది భిన్నమైన డిజైన్‌తో వస్తుంది. ఈ మూడు models ప్రస్తుతం మనం చూస్తున్న iPhone X తరహాలో అంచులు లేని bezel-less డిజైన్‌తోనే వస్తున్నాయి.

వీటిలో iPhone X 2018 మోడల్ 5.8 అంగుళాల OLED displayతోనూ, iPhone X Plus 2018 మోడల్ అనేది 6.5 అంగుళాల displayతోనూ రాబోతోంది. మూడవ మోడల్‌లో OLED screenకి బదులుగా 6.1 అంగుళాల LCD screen అమర్చబడుతుంది. ఈ మూడు phoneలూ Face ID సదుపాయంతో కూడిన TrueDepth camera సిస్టమ్‌తో లభించబోతున్నాయి.

LCD screen కలిగిన మోడల్‌ని ప్రధానంగా ఇండియా వంటి మార్కెట్లోకి 40-50 వేల రూపాయల ధరలో విక్రయించే ఆలోచనలో Apple ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం iPhone Xలో ఉన్న పలు లోపాలను సరిచేస్తూ అతి స్వల్పమైన డిజైన్ మార్పులతో ఈ మూడు phoneలు రాబోతున్నాయి. ఇక మొబైల్ ప్రియుల‌కు పండ‌గే పండ‌గ‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -