Thursday, May 9, 2024
- Advertisement -

పుష్కర ప్రమాదానికి కారణం భక్తులే, టూరిజం ప్రమాదానికి కారణం పర్యాటకులేః బాబు

- Advertisement -

పుష్కర ప్రమాదంలో మూడు పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టిడిపి భజన మీడియాతో సహా చంద్రబాబు అండ్ కో అందరూ కూడా భక్తులదే తప్పు అని పరోక్షంగా తేల్చేశారు. ఆంధ్రజ్యోతి ఎం.డి రాధాకృష్ణ అయితే డైరెక్ట్‌గా భక్తులదే తప్పు అని చెప్పేశాడు. చనిపోయిన భక్తులకు క్రమశిక్షణ లేకుండాపోయింది, అందుకే తొక్కిసలాట జరిగి చనిపోయారు అని ఫైనల్‌గా కామెంట్స్ పాస్ చేశారు.

నిన్న జరిగిన బోటు ప్రమాదంలో ఇప్పటికే 21 మంది మరణించారు. ఇప్పుడు కూడా పచ్చ మీడియా, బాబు ప్రభుత్వం కథలన్నీ కూడా చనిపోయిన పర్యాటకులదే పాపం అని తేల్చేస్తున్నాయి. ఇంతకు ముందు భజన మీడియాలోనూ, ప్రెస్ మీట్స్‌లోనూ భక్తులదే పాపం అని చెప్పినవాళ్ళు కాస్తా ఇప్పుడు మాత్రం డైరెక్ట్‌గా అసెంబ్లీలోనే చనిపోయిన పర్యాటకులదే పాపం అని తేల్చేస్తున్నారు. సాక్షాత్తూ చంద్రబాబే అసెంబ్లీలో ఈ విషయాన్ని తేల్చిచెప్పారు. అసెంబ్లీలో మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ అవుతాయన్న విషయం తెలిసిందే. అందుకే భవిష్యత్తరాల వారు కూడా బాబు నిప్పు అనే అనుకోవాలి, బాబు తప్పు చేశాడు అని అనుకోవడానికి వీల్లేదు అన్నది పచ్చ సిద్ధాంతం కాబట్టి చనిపోయిన పర్యాటకులదే పాపం అని తేల్చి చెప్పడానికి ఈ సారి అసెంబ్లీని వేదికగా చేసుకున్నారు.

‘పర్యటనకు వచ్చిన వాళ్ళు కూడా వచ్చాం, పని కంప్లీట్ చేసుకుని పోవాలనే ఉద్ధేశ్యంతో ఆ బోటును అప్రోచ్ అయ్యారు. అతను డబ్బులకు ఆశపడి వీళ్ళను తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నాడు…..ప్రమాద సమయంలో పర్యాటకులు అందరూ భయపడి ఒక పక్కకు ఒరగడం……..’ ఇలా సాగింది అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగం. చంద్రబాబు ప్రసంగ శైలికి మాత్రం వహ్వా అనాల్సిందే. తాను నిప్పు అని చెప్పుకోవడానికి ఓ స్థాయిలో తాపత్రయపడ్డాడు చంద్రబాబు. అయితే అన్ని మాటలు ఇలా సమర్థించుకుంటూ మాట్లాడితే రేపు పచ్చ మీడియాలో హైలైట్ అవ్వడానికి న్యూస్ ఉండదు కాబట్టి దిగ్భ్రాంతి చెందాను లాంటి డైలాగులు కూడా కొట్టారు. ఆ తర్వాత షరా మామూలుగానే ఇకపైన ఇలాంటివి జరగకుండా చట్టం రూపొందిస్తానని చెప్పుకొచ్చాడు.

ప్రతిపక్ష వైకాపా అసెంబ్లీని బహిష్కరించిన నేపథ్యంలో అసెంబ్లీలో ప్రమాదానికి కారణమైన ప్రభుత్వ నిర్లక్ష్యంపై మాట్లాడిన వాళ్ళు, బాధితుల తరపున మాట్లాడినవాళ్ళే లేరు. ప్రమాదం చోటు చేసుకున్న గంట వరకూ సహాయక చర్యలే చేపట్టలేదని బాధితులు గుండెలు పగిలేలా రోధించిన విషయంపై ఎవ్వరూ మాట్లాడలేదు? అధికార యంత్రాంగం మొత్తం కేంద్రీకృతమై ఉన్న చోటే స్పందన ఇలా ఉంటే మిగతా రాష్ట్రంలో ఎలా ఉందో ఏం చెప్పాలి? అధికార యంత్రాంగం, పోలీసుల పని వెళ్ళొద్దని చెప్పడమా? బోటు వెళ్ళకుండా అడ్డుకోవడమా? అర్హత, అనుభవం లేని డ్రైవర్‌కి ఏ ప్రభుత్వ యంత్రాంగం పర్మిషన్ ఇచ్చింది? లాంటి ప్రశ్నలకు సమాధానమే లేదు. చంద్రబాబుకు తన పాలనలో లోపాలు మాత్రం అస్సలు కనిపించవు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుష్కర ప్రమాదంలో నలుగురు భక్తులు చనిపోతే వైఎస్‌ని రాజీనామా చేయమని డిమాండ్ చేసిన ఘనుడు చంద్రబాబు. అప్పట్లో పచ్చ మీడియా మొత్తం కూడా వైఎస్సే దగ్గరుండి ఆ నలుగురిని చంపించాడు, ఫ్యాక్షనిస్ట్‌లకు ప్రాణాల విలువ ఏం తెలుస్తుంది? అని ఓ స్థాయిలో విరుచుకుపడ్డాయి. అదే ఇప్పుడు బాబు పాలనలో మాత్రం చంద్రబాబు అండ్ కో, పచ్చ మీడియా మొత్తానిది ఒకటే సిద్ధాంతం…..ఎన్ని ప్రమాదాలు జరిగినా? పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నా కూడా అంతా చనిపోయినవాళ్ళదే పాపం…..బాధితులదే తప్పు …..బాబు నిప్పు అని నిస్సిగ్గుగా చాటింపు వేసుకుంటున్నారు. రేపో మాపో ఈ ప్రమాదం వెనకాల కూడా జగన్ కుట్ర ఉందని కూడా టిడిపి అండ్ పచ్చ మీడియా సరికొత్త కథలను జనాలకు వినిపిస్తుందనడంలో సందేహం లేదు. ఈ పచ్చ ప్రచార మాయలో నుంచి ప్రజలు బయటపడగలరా ఎప్పటికైనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -