Sunday, April 28, 2024
- Advertisement -

భ‌య‌ప‌డి ప‌రుగులు తీస్తున్న జ‌నాలు

- Advertisement -

ప్ర‌పంచంలో అక్క‌డ‌క్క‌డా వింత‌లు జ‌రుగుతుండ‌టం స‌హ‌జం.జ‌న్యులోపాల‌వ‌ల్ల వికృత ఆకారంలో జంతువులు జ‌న్మ‌స్తుంటాయి.గ‌తంలో విష్ణుమూర్తిఆకారంలో అవుదూడ జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే.ఇలాంటి వింత‌లు చాలో చోట్లాజ‌రుగుతుంటాయి.ఇప్పుడు తాజాగా మ‌రో వింత సంఘ‌ట‌న చోటుచేసుకుంది.వికృత రూపంలో జ‌న్మించిన మేక‌ను చూసి అక్క‌డి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డి ప‌రుగులు తీస్తున్నారు.

వికృత రూపంలో మేకపిల్ల జన్మించడంతో అది చూసిన జనాలు బెంబేలెత్తి భయంతోపరుగులు తీశారు. దీంతో మేక యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటన మధ్య అర్జెంటీనాలోని శాన్‌లూయిస్‌లో చోటు చేసుకుంది. మేకపిల్ల రెండు కళ్లు అసాధారణంగా లోపలకు కుచించుకుపోయి ఉండటంతో రాక్షస రూపంలా కనిపిస్తోంది. అంతేకాకుండా మేకపిల్ల ముఖంలో కూడా మార్పులు ఉన్నాయి.

అక్కడిచేరుకున్న పోలీసులు భయభ్రాంతులకు గురవుతున్న వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మేకపిల్ల ముఖ భాగం మినహా మిగిలిన శరీరం మొత్తం బాగానే ఉందని చెప్పారు. పెద్ద ఎత్తున మేకల స్ధావరం దగ్గరకు చేరుకున్న వారిలో ఓ వ్యక్తి మేకపిల్ల ఫోటో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది.అయితే ఇది జ‌న్యులోపాల వ‌ల్ల ఇలాజ‌రుగుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -