Saturday, May 11, 2024
- Advertisement -

షెల్ఫీలు తీస్తోన్న ఫ్రెడ్జ్

- Advertisement -

మనకు తెలిసింది సెల్ఫీలు, వెల్ఫీలే. సెల్ఫీలంటే మన ఫొటో మనమే తీసుకోవడం… వెల్ఫీలంటే మన వీడియో మనమే తీసుకోవడం. అయితే సెల్ఫీ అయినంత బాగా వెల్ఫీ పదం పాపులర్ కాలేదు. రీసెంట్ గా ఫ్యూచర్ లో దునియాను దున్నే దోతి కాన్సెప్ట్ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది. ఇందుల్లో 180 డిగ్రీల కోణంలో ఫొటోలు తీసే ప్రక్రియ వచ్చింది.

అయితే వీటన్నింటికి విరుద్దంగా షెల్ఫీ అనే పదం బ్రిటన్ ,అమెరికాలో పాపులర్ అవుతుంది. దీని సంగతేంటంటే.. ఇదొక ఫ్రిడ్జ్ కాన్సెప్ట్. మనం సూపర్ బజార్ కు వెళ్లినప్పుడు ప్రిడ్జ్ లో ఏమున్నాయో తెలుసుకుంటే… ఇంకా ఏం కావాలో మనం కొనుక్కోవచ్చు. కాని ఫ్రిడ్జ్ లో ఉన్న కాయగూరలు, పళ్లు గురించి మనం తెలుసుకోకుండానే ఒక్కోసారి సూపర్ బజార్లకు వెళ్లిపోతుంటాం. అందుకేనేమో ఈ షెల్ఫీ కాన్సెప్ట్ వెలుగులోకి వచ్చింది.

తాజాగా ఫ్రిడ్జ్ లు కూడా తన దగ్గర ఎలాంటి నిల్వ వస్తువులున్నాయో.. ఫొటోలు తీసి మరీ స్మార్ట్ ఫోన్ లోకి పంపిస్తూ ఉంటాయి. ఇలాంటి ఇంటిలిజెంట్ ఫ్రిడ్జ్ లు అలాంటి అనవసర కొనుగోళ్లను వృథాను తగ్గిస్తాయి. తన షెల్ప్ లలో ఏమేం ఉన్నాయో వాటిని ఫొటోలుగా తీసి తమ యజమాని సెల్ ఫోన్ కు పంపిస్తాయి. ఇలా చేయడం వలన షాపింగ్ మరింత ఈజీ అయిపోతుంది. ఇలాంటి ఫ్రిడ్జ్ లు బ్రిటన్, అమెరికా తదితర దేశాల్లో బాగా పెరిగాయి. వీటి ధర ఆయా దేశాల్లో 3.5లక్షల వరకు ఉండగా ..బాష్ కంపెనీకి చెందిన హోం కనెక్ట్ ఫ్రిడ్జ్ ధర 82వేలు పలుకుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -