Thursday, May 2, 2024
- Advertisement -

అత్యాచారాలు, వెంకన్న… కాదేదీ రాజకీయాలకు అనర్హం….. నారావారి అసలు గుట్టు

- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానం నిజంగానే కేంద్రం పరిధిలోకి వెళ్తుందా? మోడీ అలాంటి ప్లాన్స్ వేసి ఆంధ్రజ్యోతి మీడియాలో వార్తలు, ఆ వార్తలకు వచ్చిన జనస్పందన చూసే వెనక్కు తగ్గాడని ఆల్రెడీ రాధాకృష్ణ తన డప్పు తాను స్టార్ట్ చేశాడు. ఇక రేపో మాపో అంతా కూడా నా హీరోయిజం……… నా బలానికి భయపడే మోడీ వెనక్కు తగ్గాడు అన్న డైలాగ్ బాబు నోటి వెంట రాకపోదు. ఇక ఆతర్వత పచ్చ బ్యాచ్ అందరూ కూడా 2019 తర్వాత జగన్ గెలిస్తే టిటిడి కూడా పోతుంది…….. అందుకే బాబును గెలిపించండి అని ప్రచారం షురూ చేయడం ఊహించగలిగినదే.

అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతిలతో పాటు పచ్చ జనాలు ఎంత గింజుకున్నా సోషల్ మీడియా, వెబ్‌సైట్స్ మాత్రం అసలు విషయం తేల్చేశాయి. టిడిపి జనాలందరూ కూడా టిటిడిని అడ్డుపెట్టుకుని రాజకీయ వ్యూహం పన్నుతున్నారని తెలుసుకున్న కేంద్రం కూడా వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం కాకుండా……… తిరుపతి పరిధిలోనే శిథిలావస్థలో ఉన్న ఇతర ఆలయాలను చారిత్రక స్థలాలుగా గుర్తించి…… వాటి బాగుకోసం నిధులు కేటాయించాలన్న ఆలోచనను వెనక్కి తీసుకుంది. కేరళ అనంత పద్మనాభ స్వామి గుడి, ఒరిస్సా పూరీ జగన్నాథ్ దేవాలయం, వేయిస్తంభాల గుడి, రామప్పగుడిలాంటి వన్నీ కూడా కేంద్రం పరిధిలోనే ఉన్నాయి. ఆ గుడుల ఆదాయలన్నీ కూడా రాష్ట్రాలకే చెందుతున్నాయి. ఆ ఆలయాల అభివృద్ధికి నిధులు మాత్రం కేంద్రం ఇస్తూ ఉంటుంది. తిరుమల చుట్టూ శిథిల అవస్థలో ఉన్న ఆలయాలకు కూడా కేంద్రం అలానే నిధులు కేటాయించాలనుకుంది. కానీ పచ్చ జనాల రాజకీయం దెబ్బకు కేంద్రం వెంటనే వెనక్కితగ్గింది. రాష్ట్రానికి నష్టం జరిగినా పర్లేదు హోదా వద్దు……… ప్యాకేజ్ కావాలి అన్న తీరుగానే ఇప్పుడు కూడా రాజకీయం కోసం రాష్ట్రానికి నష్టం చేశారు.

ఒక పిసిపాపను అత్యాచారం చేసినవాడిని వైకాపా అకౌంట్‌లో వేయాలని చూసి……. తాపత్రయపడి……. ఆ సుబ్బయ్య బంధువులు వైకాపాలో ఉన్నారని చెప్పి……… తీర అదే సుబ్బయ్యకు టిడిపి సభ్యత్వం కార్డ్….. అది కూడాసుబ్బయ్య ఫొటోతో ఉన్న కార్డ్‌ని రోజా చూపించిన వెంటనే బాబు అండ్ కో అంతా సైలెంట్ అయినట్టుగానే ఇఫ్పుడు కూడా శిథిలావస్థలో ఉన్న దేవాలయాలకు నిధులిస్తాం బాబో అంటే ఏడ్చి గగ్లోలు పెట్టి రాజకీయం చేసిన పచ్చ బ్యాచ్ అంతా కూడా నిధులు రాకుండా దిగ్విజయంగా అడ్డుకున్నాయి. రాష్ట్రం ఎంతలా నష్టపోతేనేం…….. బాబుకు ఉపయోగపడేలా రాజకీయం, రంకు ప్రచారమేగా పచ్చ బ్యాచ్‌కి కావాల్సింది. ఏమంటారు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -