Tuesday, May 21, 2024
- Advertisement -

రజినీ రాజకీయ జీవితంపై చంద్రబాబు వేసిన మచ్చ గురించి తెలుసా?

- Advertisement -

రజినీకాంత్ రాజకీయ ఎంట్రీ ఖాయమైంది. రజనీకాంత్ యోగి, సిద్ధుడు అనే స్థాయిలో మన భజన మీడియా ఆయన గురించి రాస్తూ ఉంటుంది. కానీ తొంభైలలో ఆయన సినిమాలకు వర్క్ చేసినవారు, ఆయనను దగ్గర నుంచి చూసినవారు మాత్రం మరోలా చెప్తూ ఉంటారు. ఆ విషయం పక్కనపెడితే చంద్రబాబు కుట్ర రాజకీయానికి రజినీకాంత్ సాయం చేసిన విషయం మీకు తెలుసా?

చంద్రబాబు రాజకీయ వ్యూహాలు, కుట్రల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హోదా ఎంత గొప్పదో, పదిహేనేళ్ళు హోదాను ఎలా తీసుకురాగలడో ఆయనే 2014 ఎన్నికల సమయంలో చెప్పిన వీడియో యూట్యూబ్‌లో ఉంటుంది. ఇక ఆ పక్కనే హోదా వేస్ట్ అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన వీడియా కూడా ఉంటుంది. ‘బ్రీఫ్డ్ మీ’ వాయిస్ తనది కాదు అని చెప్పలేడు బాబు. ఆయన మాట్లాడి ఉండకపోతే ఆయన మాట్లాడలేదు అన్న విషయం బాబుకు తెలియదా? కానీ నేను నిప్పు అంటాడు……ఆ బ్రీఫ్డ్ మీ వాయిస్ మీది కాదా అంటే మాత్రం సమాధానం చెప్పకుండా నీళ్ళు నములుతాడు. ఇక ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఇవ్వండి అని చెప్పి దేశంలో ఉన్న నాయకులందరినీ కలిసి, లేఖలు రాసి, సోనియాను డిమాండ్ చేసిన బాబుగారు తన మీడియా బలంతో ఆంద్రప్రదేశ్ కోసం పాటుపడిన వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకోగలడు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ఇవ్వకపోతే 2014లో అధికారంలోకి వచ్చాక మేము ఇస్తాం అని చెప్పి కాంగ్రెస్‌ని బెదిరించిన, బిల్లు పాస్ అవ్వడంలో అన్ని విధాలుగా సాయం చేసిన బిజెపిని కూడా నిర్దోషి అని చెప్పి ఆంద్రప్రదేశ్ ప్రజలను నమ్మించగల కుట్ర రాజకీయాలు పచ్చ బ్యాచ్ సొంతం.

1994ఎన్నికలకు ముందే లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ వివాహమైంది. ఎన్టీఆర్ వివాహం తెలుగు ప్రజలకు తప్పుగా అనిపించలేదు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ అధికారంలో లేనప్పుడు లక్ష్మీపార్వతి గురించి ఏమీ మాట్లాడలేదు. 1994ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలోనూ లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్‌తో కలిసి మాట్లాడింది. రాష్ట్రమంతా తిరిగింది. అప్పుడు కూడా చంద్రబాబు అండ్ బ్యాచ్‌కి తప్పుగా అనిపించలేదు.

కానీ 1994లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం లక్ష్మీపార్వతి దోషిగా కనిపించింది. ‘ఎన్టీఆర్‌కి విలువలు లేవు’ అని చంద్రబాబు ఇండియా టుడే ఇంటర్యూలో చెప్పాడు. అధికార దాహంతో ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కోవడం మాత్రం గొప్ప మానవతా విలువలున్న మనుషులు చేసేది మరి. అయితే ఈ ఎన్టీఆర్‌ని పదవి నుంచి దించే కుట్ర వ్యూహంలో రజినీ కూడా అప్పట్లో బాబుకు సాయం చేశాడు. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి మరీ లక్ష్మీపార్వతిని దోషిగా నిలబట్టె విషయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆ నాటి రాజకీయాలను దగ్గరగా చూసిన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ తాజాగా ఈ విషయాలను చెప్పుకొచ్చాడు. అధికారం ఇంటే ఇష్టం లేదు, డబ్బులు లెక్క కాదు. సాధువు లాంటి వాడిని అని చెప్పుకునే రజినీకాంత్ ….ఎన్టీఆర్‌ని పదవి నుంచి దించే కుట్ర రాజకీయంలో చంద్రబాబుకు ఎందుకు సాయం చేసినట్టు? ఏం స్వార్థం ఉన్నట్టు? అని ఇప్పుడు రజినీని తమిళ తంబీలు నిలదీస్తున్నారు. చంద్రబాబా మజాకానా? ఆయన కుట్ర రాజకీయంలో రజినీని కూడా ఆ స్థాయిలో పావును చేశాడు మరి. ఇక ఈ విషయం రజినీకి ఏ స్థాయిలో మెడకు చుట్టుకుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -