పంచ దేశాలు చైనాను చూసి బెంబేలెత్తి పోతున్నాయి. ఇప్పటికే కారు చౌకైన చైనా వస్తువులు ఇతర దేశాలను ముంచెత్తుతున్నాయి. ఏదేశమైనా సరే అక్కడ చైనా వస్తువు ఉండాల్సిందే. అయితే చైనాను ఇప్పుడు ఓసమస్య పట్టిపీడిస్తోంది. ఆసమస్యేంది అనుకుంటున్నారా…? గాడిదల సమస్య. గాడిదల కొరనున చైనా తీవ్రంగా ఎదుర్కొంటోంది.
చైనాలో గాడిదల సంఖ్య తగ్గిపోయింది. దీంతో వాటికి డిమాండ్ ఏర్పడింది. తీంతో ఇతర దేశాల్లోని గాడిద తోలు విక్రయదారులను ఆకర్షించేందకు వాటిపై సుంకాన్ని 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం చైనాలో గాడిద తోలుకు భారీ రేటు పలుకుతోంది. ఒక్కో గాడిద తోలును మన కరెన్సీలో దాదాపు రూ. 30 వేలకు కొంటున్నారు.
గాడిదతోలుకు ఇంత డిమాండ్ ఎందుకునుకుంటున్నారా…? గాడిద తోలు నుంచి తీసే జెలిటిన్ కు అక్కడ ఫుల్ డిమాండ్ ఉంది. తోలు చర్మకండరాల నుంచి కాచి తీసిన రుచిలేని జిగురు పదార్థమే ఈ జెలిటిన్. దీన్ని చర్మ సౌందర్యాన్ని పెంచే సంప్రదాయ చైనా ఔషధాల్లో వాడతారు. గాడిదల సంఖ్య తగ్గిపోవడంతో ఈ పదార్థానికి పుల్ డిమాండ్ ఏర్పడింది.
అంతే కాదు చైనాలో గాడిద మాంసాన్ని కొన్ని ప్రాంతాల్లో ఇష్టంగా తింటారు. ఇప్పటికే కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న చైనా వస్తువులే అనుకుంటే ….చైనా దెబ్బకు తమ దేశంలోని గాడిదలు మాయమయ్యే అవకాశం ఉందని ఇతర దేశాల ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి.